ePaper
More
    HomeతెలంగాణTorrential rain | దంచికొట్టిన వాన.. గంటలో 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు..

    Torrential rain | దంచికొట్టిన వాన.. గంటలో 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు..

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: torrential rain పగలంతా ఉక్కపోతతో మహానగర metropoli ప్రజలు అల్లాడారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా భారీ మేఘం గ్రేటర్​ హైదరాబాద్(Greater Hyderabad)​ను కమ్మేసింది. సన్నని చినుకులతో మొదలై, జడివానను కురిపించింది.

    కుండపోత వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్​ నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరదనీరు చేరింది. కూకట్​పల్లి Kukatpally, ప్రగతినగర్ Pragathi Nagar, గండిమైసమ్మ Gandi Maisamma ప్రాంతాల్లో మోకాలు లోతు నీరు చేరింది. ప్రగతినగర్​లో అయితే దారుణంగా వరద నీరు చేరింది. ఇక్కడ రోడ్డుపైనే రెండడుగుల మేర వరద ప్రవహించింది.

    రామంతపూర్‌, ఉప్పల్‌, నాచారం, తార్నాక, పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్ లోనూ వరద బీభత్సం సృష్టించింది. భారీ వర్షం కురవడంతో నగర, కాలనీల వీధులు వేగంగా ప్రవహించే వరదతో వాగులను తలపించాయి. లోతట్టు కాలనీలు చెరువులయ్యాయి. బైకులు, కార్లు, ఆటోలు నీట మునిగాయి. ఎక్కడ చూసినా ట్రాఫిక్‌ కష్టాలు తప్పలేదు. దీంతో వాహనదారులు బయటకు రాలేక అల్లాడారు.

    READ ALSO  Nizamabad City | భార్య ఆత్మహత్యకు కారణమైన భర్తకు జైలు

    torrential rain : మెట్రోలో పెరిగిన రద్దీ..

    భారీ వర్షం నేపథ్యంలో రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయి ఎక్కడికక్కడ ఆగిపోయాయి. గంటలో వంద మీటర్లు కూడా కదలని పరిస్ఙితి ఏర్పడింది. మరోవైపు మెట్రో (METRO) లకు ప్రయాణికుల తాకిడి పెరిగింది. రోడ్లపై ట్రాఫిక్​ జామ్​ కావడంతో ప్రయాణికులు, సాఫ్ట్ వేర్​ ఉద్యోగులు మెట్రోను ఆశ్రయించారు. దీంతో మెట్రోల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. అమీర్​పేట్​ జంక్షన్​ వద్ద కాలు కదపలేనంతగా రద్దీ నెలకొంది.

    torrential rain : వర్షం లోనే విధులు..

    భారీ వర్షం నేపథ్యంలో పోలీసులు పెద్ద మొత్తంలో రహదారుల కూడళ్లపై విధులు నిర్వర్తించారు. వర్షంలో తడుస్తూనే ట్రాఫిన్​ను నియంత్రించే పనిలో నిమగ్నమయ్యారు. వాహనదారులను నియంత్రిస్తూ.. మెల్లిమెల్లిగా ట్రాఫిక్​ను క్లియర్​ చేశారు.

    READ ALSO  Drug racket | హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్‌ కలకలం.. ఈసారి ఎక్కడంటే..

    మొత్తం మీద హైదరాబాద్​లో రెండు గంటల్లో ఏడు సెంటిమీటర్లకు పైగా వర్షం పడినట్లు చెబుతున్నారు. అత్యధికంగా షేక్​పేట్​, జూబ్లీహిల్స్‌ లో  గంటలోనే 7.4 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు అయింది. ఆసిఫ్‌నగర్‌, మెహిదీపట్నంలో 5.3 సెంటీమీటర్లు, ఖైరతాబాద్‌లో 5 సెంటిమీటర్ల వర్షం కురిసింది.

    బంజారాహిల్స్‌లోనూ వర్షం దంచికొట్టింది. ఇక్కడ 4.6 సెంటీ మీటర్ల వర్షం పడింది. మంగళవారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ పేర్కొంది.

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 5 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Critical Minerals | యువతకు గుడ్​ న్యూస్​.. రాష్ట్రానికి రెండు క్రిటికల్​ మినరల్స్ రీసెర్స్ సెంటర్స్ మంజూరు!

    అక్షరటుడే, హైదరాబాద్: Critical Minerals : తెలంగాణ (Telangana) విద్యా పొదిలో మరో రెండు కీలక పరిశోధన కేంద్రాలు...

    Collector Kamareddy | జుక్కల్​ సీహెచ్​సీ సూపరింటెండెంట్​, డ్యూటీ డాక్టర్​కు షోకాజ్​ నోటీసులు

    అక్షరటుడే, నిజాంసాగర్​: Collector Kamareddy | జిల్లాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల పట్ల కామారెడ్డి కలెక్టర్​ కొరడా జులిపిస్తున్నారు....

    CM Revanth | రాష్ట్రంలో భారీ వర్షాలు.. సీఎం రేవంత్​ కీలక ఆదేశాలు..

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : గ్రేటర్​ హైద‌రాబాద్‌ (Greater Hyderabad) తో పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు...

    More like this

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 5 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    Critical Minerals | యువతకు గుడ్​ న్యూస్​.. రాష్ట్రానికి రెండు క్రిటికల్​ మినరల్స్ రీసెర్స్ సెంటర్స్ మంజూరు!

    అక్షరటుడే, హైదరాబాద్: Critical Minerals : తెలంగాణ (Telangana) విద్యా పొదిలో మరో రెండు కీలక పరిశోధన కేంద్రాలు...

    Collector Kamareddy | జుక్కల్​ సీహెచ్​సీ సూపరింటెండెంట్​, డ్యూటీ డాక్టర్​కు షోకాజ్​ నోటీసులు

    అక్షరటుడే, నిజాంసాగర్​: Collector Kamareddy | జిల్లాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల పట్ల కామారెడ్డి కలెక్టర్​ కొరడా జులిపిస్తున్నారు....