అక్షరటుడే, వెబ్‌డెస్క్: train travel : కుటుంబంతో సహా రామేశ్వరం వెళ్లాలనుకున్న మగ్గిడి శేఖర్ రైలు టికెట్లకు ప్రయత్నిస్తే వెయిటింగ్ లిస్టు కనిపించింది. ప్రయాణానికి ఇంకా 10 రోజుల సమయం ఉందికదా అని ఆగారు. కానీ, టికెట్స్ కన్ఫర్మ్ అవలేదు. దీంతో కుటుంబ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు.
దక్షిణ మధ్య రైల్వే జోన్ (South Central Railway zone) పరిధిలో గత మూడేళ్లలో ఇలా.. 1.09 కోట్ల టికెట్లు (train tickets) క్యాన్సిల్ కావడం గమనార్హం. అంటే ఏడాదికి సగటున 36.3 లక్షల మంది ప్రయాణికులు ఇక్కట్ల పాలయ్యారన్నమాట.
కొవిడ్(COVID) మహమ్మారి తర్వాత ప్రకృతి, ఆధ్యాత్మిక క్షేత్రాలకు వెళ్లిరావడం చాలా మంది అలవాటుగా మార్చుకున్నారు. వీరిలో ఎక్కవగా మధ్య తరగతి వారు రైలు ప్రయాణానికే ఆసక్తి కనబర్చుతున్నారు. కానీ, ఏ రైలు తీసుకున్నా.. వందల్లో వెయిటింగ్ లిస్టు ఉంటుండటం ఆందోళనకరం.
ఫలితంగా ట్రైన్ ట్రావెలింగ్కు చాలామంది దూరం అవుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరాలు, పట్టణాల నుంచి సికింద్రాబాద్, తిరుపతి, విశాఖ, విజయవాడ, ఢిల్లీలకు ప్రస్తుతం ఉన్న రైళ్లు సరిపోవడం లేదు. ఇక దసరా, సంక్రాంతి లాంటి పండగలకైతే ప్రయాణికుల (Passengers) సమస్య వర్ణనాతీతం. వేసవి సెలవుల్లోనూ ఇదే సమస్య.