Nizamabad City
Nizamabad City | భార్య ఆత్మహత్యకు కారణమైన భర్తకు జైలు

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad City | భార్యను వేధించి, ఆత్మహత్యకు కారకుడైన భర్తకు న్యాయస్థానం జైలుశిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే.. గాంధారి మండలం (Gandhari mandal) చద్మల్​ గ్రామానికి చెందిన మౌనికకు మంచిప్ప గ్రామానికి చెందిన సాయికుమార్​తో ఏడేళ్లక్రితం వివాహమైంది. అయితే వివాహమయ్యాక అనేకమార్లు భార్యభర్తల మధ్య గొడవలు జరిగాయి. భర్త తీరు మారకపోవడం, ఆయన వేధింపులు ఎక్కువ కావడంతో మౌనిక 2023 ఆగస్ట్​ 28వ తేదీన ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెకు కుమారుడు ఉన్నాడు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. కేసు పూర్వపరాలు పరిశీలించిన జిల్లా న్యాయమూర్తి భరత లక్ష్మీ (District Judge Bharatha Lakshmi).. మౌనిక ఆత్మహత్యకు కారణమైన భర్త సాయికుమార్​కు పదేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే భార్యను వేధించిన కేసులో మూడేళ్ల సాధారణ జైలుశిక్ష విధించారు. అలాగే రూ. వెయ్యి జరిమానా వేశారు. ఈ కేసులో సాయికుమార్​ తల్లిని నిర్దోషిగా పేర్కొంటూ తీర్పునిచ్చారు.