అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Guvvala Balaraju | బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ (Former MLA Guvvala Balaraj) పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను సోమవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు (KCR) పంపారు.
గువ్వల బాలరాజ్ గతంలో రెండు సార్లు బీఆర్ఎస్ నుంచి అచ్చంపేట ఎమ్మెల్యేగా (Achampet MLA) గెలుపొందారు. పార్టీపై అసంతృప్తితో రాజీనామా చేస్తున్నట్లు గువ్వల బాలరాజు పేర్కొన్నారు. చాలాకాలం పాటు ఆలోచించి రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తన లేఖలో పేర్కొన్నారు.
గువ్వల బాలరాజ్ బీఆర్ఎస్ నుంచి రాజకీయాల్లో కీలకంగా ఎదిగారు. 2009లో బీఆర్ఎస్ నుంచి నాగర్ కర్నూల్ ఎంపీగా (Nagar Kurnool MP) పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అచ్చంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2023లో అదే స్థానంలో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ చేతిలో ఓడిపోయారు.
Guvvala Balaraju | బీజేపీలో చేరనున్న గువ్వల
గువ్వల బాలరాజు బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావుతో (BJP state president Ramachandra Rao) భేటీ అయ్యారు. తాజాగా గులాబీ పార్టీకి రాజీనామ చేశారు.
ఈ నెల 9న ఆయన బీజేపీలో చేరుతారని సమాచారం. ఆయనతో పాటు మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ను వీడతారని ప్రచారం జరుగుతోంది. ఈ నెల 10న వారు కాషాయ కండూవా కప్పుకుంటారని తెలిసింది. స్థానిక ఎన్నికల వేళ మాజీ ఎమ్మెల్యే పార్టీని వీడటం బీఆర్ఎస్కు నష్టం కలిగించే అవకాశం ఉంది.