అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kaleshwaram Commission Report | కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అవినీతి, అక్రమాలకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కారణమని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) తెలిపారు. ఈ మేరకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిందన్నారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై (Kaleshwaram Commission report) సోమవారం మంత్రివర్గంలో చర్చించారు. అనంతరం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు. ప్రాజెక్ట్‌లో అక్రమాలు, అవినీతికి, నిర్వహణ లోపాలకు పూర్తి బాధ్యత కేసీఆర్‌దేనని కాళేశ్వరం కమిషన్ తన నివేదికలో పేర్కొందన్నారు.
Kaleshwaram Commission Report | అది అబద్ధం
తుమ్మిడిహట్టి వద్ద నీరు లేదని మేడిగడ్డకు బ్యారేజీని మార్చడం నిజాయితీతో తీసుకున్న నిర్ణయం కాదన్నారు. మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించాలని కేసీఆర్ (KCR) తన సొంతంగా నిర్ణయం తీసుకున్నట్లు కమిషన్ పేర్కొందన్నారు. 2015లో నాటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమ భారతి ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్ట్‌కు (Pranahita-Chevella project) హైడ్రాలజీ అనుమతి ఇచ్చినట్లు లేఖ రాశారన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద 205 టీఎంసీల నీటి లభ్యత ఉన్నట్లు ఆమె లేఖలో పేర్కొన్నారు. అయినా కానీ బ్యారేజీ నిర్మాణ స్థలాన్ని మార్చారన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేకపోవడంతో మేడిగడ్డకు మార్చమనేది అసలైన కారణం కాదన్నారు. అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీల నిర్మాణం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో జరిగాయన్నారు.
Kaleshwaram Commission Report | నిపుణుల కమిటీ వద్దన్నా..
కేసీఆర్ హయాంలో వేసిన నిపుణుల కమిటీ కూడా మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం సరికాదని పేర్కొందన్నారు. ప్రాణహిత నదిపై వేమనపల్లి వద్ద బ్యారేజీ కట్టాలని కమిటీ సూచించినట్లు పేర్కొన్నారు. మేడిగడ్డ వద్ద కడితే డబ్బులు వృథా అవుతాయని చెప్పిందన్నారు. అయినా కూడా బ్యారేజీ నిర్మాణ స్థలం (barrage construction site) మార్చారని మంత్రి వెల్లడించారు. తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు ఉన్నాయని సీడబ్ల్యూసీ చెప్పిందన్నారు. మంత్రివర్గంలో చర్చించకుండానే.. మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) నిర్మాణానికి నాటి సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నిర్ణయించారన్నారు.
Kaleshwaram Commission Report | అందుకే కుంగిపోయాయి
సాధారణంగా బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయరన్నారు. బ్యారేజీలకు డ్యామ్‌లకు తేడా ఉంటుందని మంత్రి చెప్పారు. బ్యారేజీల్లో నీటి నిల్వ సామర్థ్యం (water storage capacity) రెండు, మూడు టీఎంసీలకు మించి ఉండదన్నారు. కానీ కేసీఆర్ మాత్రం బ్యారేజీల్లో నిండా నీటిని నిల్వ చేయడంతో కుంగిపోయాయని కమిషన్ పేరొందన్నారు. రూ.వేల కోట్లతో నిర్మించిన మూడు బ్యారేజీలను నిర్వహణను పట్టించుకోలేదన్నారు. నాటి సీఎం రాజకీయ జోక్యం చేసుకోవడంతోనే మూడు బ్యారేజీలు కుంగిపోయాయన్నారు. నాటి సీఎం కేసీఆర్ సొంత నిర్ణయం మేరకు ప్రాణహిత–చేవేళ్ల ప్రాజెక్ట్‌ను రీ డిజైన్ చేశారన్నారు.
Kaleshwaram Commission Report | అధిక వడ్డీలతో అప్పులు
అధిక వడ్డీతో రూ.84 వేల కోట్లు అప్పు తెచ్చి కట్టిన కాళేశ్వరం కూలిపోయిందని మంత్రి పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై (Kaleshwaram project) విచారణ చేపడతామని హామీ ఇచ్చామన్నారు. ఈ మేరకు పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిషన్ 665 పేజీల నివేదిక ఇచ్చినట్లు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు.
2019 జూన్ 21న కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను ప్రారంభించారన్నారు. 2023 అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజీ (Medigadda barrage) కుంగిపోయిందని మంత్రి వివరించారు. అప్పుడే ఎన్డీఎస్ఏ పరిశీలించి ప్లానింగ్, డిజైన్‌లో లోపాలు ఉన్నాయని తెలిపిందన్నారు. అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉందన్నారు.