అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana Cabinet | సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన సోమవారం నిర్వహించిన తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై (Kaleshwaram Commission report) కేబినెట్‌లో చర్చించినట్లు తెలుస్తోంది. పీసీ ఘోష్ నివేదికపై మంత్రి ఉత్తమ్ ప్రజెంటేషన్ ఇచ్చినట్లు సమాచారం. కాగా.. పీసీ ఘోష్ కమిషన్ నివేదికను అసెంబ్లీలో చర్చించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా.. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ (Justice PC Ghosh Commission) సుమారు 700 పేజీల నివేదికలోని సారాంశాన్ని క్లుప్తంగా నోట్ రూపంలో తయారు చేసిన విషయం తెలిసిందే. అధికారుల కమిటీ రూపొందించిన ఈ నోట్‌పై మంత్రిమండలిలో చర్చ జరిగింది.