అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad Rains | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వర్షం (Hyderabad Rains) దంచికొడుతోంది. కుండపోత వర్షం కారణంగా పలు కాలనీలు జలమయం అయ్యాయి. కొన్ని చోట్ల రోడ్లపై వర్షపు నీరు ఉధృతంగా పారుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. సెక్రటేరియట్, ఎల్బీనగర్, షేక్‌పేట, అబ్దుల్లాపూర్ మేట్, హయత్‌నగర్, నాగోల్, బర్కత్‌పుర, బండ్లగూడ వనస్థలిపురం వాన దంచికొడుతోంది. దీంతో అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ భారీగా జాం అయ్యింది.
Hyderabad Rains | షేక్‌పేట్‌లో అత్యధిక వర్షపాతం
షేక్‌పేట్‌లో (Sheikhpet) అత్యధికంగా 7.4 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఆసిఫ్‌నగర్‌లో 5.3, ఖైరతాబాద్‌లో 5 సెం.మీ వర్షం కురిసింది. ఇక రాబోయే రెండు గంటల్లో తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌కు ఆరెంజ్ అలర్జ్ (Orange alert) జారీ చేసింది.
Hyderabad Rains | ప్రజలకు భయటకు రావొద్దని సూచన
రాజ్‌భవన్ ముందు నుంచి భారీగా వరద నీరు పారుతోంది. అలాగే జీడిమెట్ల, కుకట్పల్లిలలో వరద నీరు ఉధృతంగా పారతోంది. పలుచోట్ల వాహనాలు సైతం కొట్టుకుపోవడం గమనార్హం. నగరంలో భారీ వర్షం కురుస్తుండడంతో ప్రజలు భయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. కుండపోత వర్షం పడడంతో జీహెచ్ఎంసీ, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి.