ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Deworming pills | విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు వేయాలి

    Deworming pills | విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు వేయాలి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Deworming pills | జిల్లాలోని ప్రతి విద్యార్థికి నులిపురుగుల నివారణ మాత్రలను అందజేయాలని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) తెలిపారు. కలెక్టరేట్​లో డీవార్మింగ్ డే (Deworming Day) కార్యక్రమంపై సోమవారం టాస్క్​ఫోర్స్​ అధికారులతో సమావేశం నిర్వహించారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 19 ఏళ్ల వయసు లోపు విద్యార్థులందరికీ మాత్రలు వేయాలన్నారు. ప్రధానంగా ప్రభుత్వ ప్రైవేట్​ పాఠశాలలు (Private Schools), కళాశాలలు, మదర్సాలు, అంగన్​వాడీ కేంద్రంలోని విద్యార్థులకు, బడిబయట పిల్లలకు ఆల్బెండజోల్​ మాత్రలు  (Albendazole tablets) వేయాలని చెప్పారు. ప్రతి పాఠశాలలో కళాశాలలో ఒక నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. భోజనం తిన్న తర్వాత ఈ మాత్ర వేయాలన్నారు. ప్రధానంగా రక్తహీనత, బరువు తగ్గుదల తదితర వ్యాధుల నుంచి కాపాడడానికి మాత్ర దోహదపడుతుందని పేర్కొన్నారు.

    READ ALSO  Collector Nizamabad | రెండు మండలాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

    Deworming pills | మైకుల ద్వారా ప్రచారం చేయాలి

    గ్రామాల్లో మైకుల ద్వారా.. పట్టణాల్లో చెత్త సేకరణ వాహనాల ద్వారా ప్రచారం చేయాలని కలెక్టర్ సూచించారు. ఈనెల 9, 10వ తేదీల్లో రెండు రోజులపాటు తప్పనిసరిగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. అనాధ బాలల ఆశ్రమాలు, బాలల సంరక్షణ కేంద్రాలు (Childcare centers), రెస్క్యూ హోంలలో (Rescue Home) కూడా డీవార్మింగ్ డేను నిర్వహించాలని సూచించారు.

    11వ తేదీన మాత్రలు ప్రతి విద్యార్థికి వేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరైనా విద్యార్థులకు అందకపోతే మలివిడతగా 18వ తేదీన వేయించాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా 19 ఏళ్లలోపు వయసు కలిగిన వారు సుమారు 4.05 లక్షల మంది ఉన్నట్లు తెలిపారు. సమావేశంలో డీఎంహెచ్​వో రాజశ్రీ, అదనపు కలెక్టర్ అంకిత్, డీపీవో శ్రీనివాసరావు, ప్రోగ్రామ్ ఆఫీసర్ అశోక్, డీడబ్ల్యూవో రసూల్ బీ తదితరులు పాల్గొన్నారు.

    READ ALSO  Ex Mla Jeevan reddy | బీజేపీ అంటే బీఆర్‌ఎస్‌పై కక్ష.. కాంగ్రెస్‌కు రక్ష: జీవన్​ రెడ్డి

    Latest articles

    Aditya Infotech | అదరగొట్టిన ‘ఆదిత్య’.. ఇన్వెస్టర్లను ముంచేసిన కాయ్‌టెక్స్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Aditya Infotech | దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో మంగళవారం మూడు కంపెనీలు లిస్టయ్యాయి. ఇందులో...

    Register Post | పోస్టల్ శాఖ సంచలన నిర్ణయం.. నిలిచిపోనున్న రిజిస్టర్​ పోస్ట్​ సేవలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Register Post | పోస్టల్​ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. రిజిస్టర్​ పోస్ట్​ సేవలను నిలిపి...

    Deepika Padukone | రికార్డుల‌కెక్కిన దీపికా పదుకొనే.. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక వ్యూస్ దాటిన ఆమె రీల్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Deepika Padukone | బాలీవుడ్ నటి దీపికా పదుకొనే అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు....

    Harish Rao | బీఆర్​ఎస్​పై ఆ రెండు పార్టీలు కుట్ర చేస్తున్నాయి.. హరీశ్​రావు సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao | కాంగ్రెస్​, బీజేపీ కలిసి బీఆర్​ఎస్​పై కుట్ర చేస్తున్నాయని మాజీ మంత్రి...

    More like this