ePaper
More
    HomeతెలంగాణBeedi Workers | బీడీ ఫ్యాక్టరీని ముట్టడించిన కార్మికులు

    Beedi Workers | బీడీ ఫ్యాక్టరీని ముట్టడించిన కార్మికులు

    Published on

    అక్షరటుడే, డిచ్​పల్లి : Beedi Workers | నెలలో పనిదినాలు పెంచాలని డిమాండ్​ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (TUCI) ప్రతినిధులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు డిచ్​పల్లి శివాజీ కంపెనీ (Shivaji Company) ఎదుట సోమవారం కార్మికులు ఆందోళనకు దిగారు. అనంతరం కంపెనీ బ్రాంచ్ మేనేజర్​కు ​వినతిపత్రం అందజేశారు.

    ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటి మాట్లాడుతూ.. గత కొన్ని నెలలుగా బీడీ కార్మికులకు నెలకు తొమ్మిది నుంచి పది రోజుల పని మాత్రమే కల్పిస్తున్నారన్నారు. దీంతో చేతినిండా పనిలేక బీడీ కార్మికులు (Beedi Workers) నష్టపోతున్నారని ఆయన పేర్కొన్నారు. కాబట్టి బీడీ యాజమాన్యం తక్షణం బీడీ కార్మికులకు 26 రోజుల పనిని కల్పించాలని మంచి నాణ్యమైన తునికి ఆకు అందజేయాలని డిమాండ్​ చేశారు. నూతన పీఎఫ్ నంబర్లను ఇవ్వాలని స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీడీ ఇండస్ట్రీ(Beedi Industry)పై జీఎస్టీ, టాక్స్ విపరీతంగా పెంచడంతో కార్మికులు నష్టపోతున్నారని ఆయన వాపోయారు.

    READ ALSO  Dichpally | డబ్బులు తీసుకుని ఐపీ పెట్టడం సరికాదు

    Beedi Workers | బీడీ పరిశ్రమపై జీఎస్టీ తొలగించాలి..

    బీడీ పరిశ్రమపై జీఎస్టీ, టాక్స్ తొలగించాలని ప్రభుత్వాన్ని సీపీఐఎంల్​ నాయకులు(CPIML Leaders) డిమాండ్ చేశారు. ప్రస్తుత కాంగ్రెస్​ ప్రభుత్వం(Congress Government) అధికారంలోకి రాగానే జీవన భృతిని రూ.4వేలకు పెంచుతామని చెప్పి ఇప్పటివరకు చేయలేదన్నారు. తక్షణం బీడీ ఇండస్ట్రీని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (TUCI) ఏరియా కార్యదర్శి కిషన్, జిల్లా నాయకులు మురళి, కమీషన్​దారులు నర్సయ్య, సాయినాథ్ సుదర్శన్, శ్రీధర్ గణేష్, రవి, కార్మికులు లక్ష్మి, సుజాత, నరసవ్వ, గౌతమి, జమున, సుమారు 400 మంది పలు గ్రామాల బీడీ కార్మికులు పాల్గొన్నారు.

    Latest articles

    National Handloom Day | పిట్లంలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం

    అక్షరటుడే, నిజాంసాగర్: National Handloom Day | పిట్లం (Pitlam) మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘం (Handloom...

    Bheemgal | ప్రొటోకాల్ పాటించడంలేదని ఫిర్యాదు

    అక్షరటుడే, భీమ్​గల్: Bheemgal | మండలంలోని పలు గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో వడ్డీ రాయితీ రుణాల పంపిణీ కార్యక్రమంలో...

    National Handloom Day | చేనేతరంగానికి ప్రభుత్వం చేయూతనివ్వాలి

    అక్షరటుడే, ఇందూరు: National Handloom Day | చేనేతరంగానికి రాష్ట్ర ప్రభుత్వం చేయూతనివ్వాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ...

    Handloom Workers Day | ఘనంగా జాతీయ చేనేత కార్మిక దినోత్సవం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : Handloom Workers Day | జిల్లా, నిజామాబాద్ పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో...

    More like this