అక్షరటుడే, వెబ్‌డెస్క్: terror attack victims : మహారాష్ట్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. పహల్గావ్ ఉగ్రదాడిలో మరణించిన మహారాష్ట్ర పౌరులకు ఆ రాష్ట్ర సర్కారు పరిహారం ప్రకటించింది. ఆరుగురు మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల చొప్పున ఆర్థిక సాయం ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ తెలిపారు. దీంతోపాటు వారి కుటుంబాల్లో ఒకరికి సర్కారు కొలువు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. మహారాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం పేర్కొన్నారు.
జమ్మూ కశ్మీర్ పహల్గావ్లో మినీ స్విట్జర్లాండ్‌గా పిలిచే బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యటకులు మరణించారు. వీరిలో అత్యధికంగా (ఆరుగురు) మహారాష్ట్రకు చెందిన పర్యాటకులు ఉన్నారు. ముంబయికి చెందిన హేమంత్ జోషి సుహాస్, దిలీప్ దేసాలే, థానేకు చెందిన సంజయ్ లక్ష్మణ్ లేలే, అతుల్ శ్రీకాంత్ మోని, పుణెకు చెందిన కస్టోబే గనోవోటే, సంతోష్ జగ్దాలే ఉగ్రదాడిలో మరణించారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయంలో స్ ఆ రాష్ట్ర మృతులకు రూ.50 లక్షల పరిహారం ప్రకటించారు.