అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | చివరి సెషన్‌లో భారీగా నష్టపోయిన దేశీయ స్టాక్ మార్కెట్ కొత్తవారాన్ని ఆశావహ దృక్పథంతో ప్రారంభించాయి. మొదట్లో ఒడిదుడుకులకు లోనయినా ఆ తర్వాత స్థిరంగా పైకి పెరిగాయి. చివరికి మంచి లాభాలతో ముగిశాయి.
సోమవారం ఉదయం సెన్సెక్స్(Sensex) 166 పాయింట్ల లాభంతో ప్రారంభమై అక్కడినుంచి మరో 137 పాయింట్లు పెరిగింది. గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో అక్కడినుంచి 402 పాయింట్లు పతనమైంది. 31 పాయింట్ల లాభంతో ప్రారంభమైన నిఫ్టీ.. అక్కడినుంచి మరో 73 పాయింట్లు లాభపడిరది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 115 పాయింట్లు క్షీణించింది. ఇంట్రాడే కనిష్టాల వద్ద సపోర్ట్ తీసుకుని సెన్సెక్స్ 693 పాయింట్లు, నిఫ్టీ 182 పాయింట్లు పైకి లేచాయి. చివరికి సెన్సెక్స్ 418 పాయింట్ల లాభంతో 81,018 వద్ద, నిఫ్టీ(Nifty) 157 పాయింట్ల లాభంతో 24,722 వద్ద స్థిరపడ్డాయి.
యూఎస్ జాబ్ డేటా బలహీనంగా రావడంతో ఆ దేశ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలకుతోడు డాలర్ విలువ బలహీనపడడంతో మార్కెట్లు పుంజుకున్నాయి. ఆటో సేల్స్(Auto sales) బాగుండడడంతో ఆ రంగంలోని షేర్లు దూసుకువెళ్లాయి. కొంతకాలంగా నష్టాల బాటలో పయనిస్తున్న ఐటీ షేర్లలో కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో మన సూచీలు పెరిగాయి.
బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 2,286 కంపెనీలు లాభపడగా 1,847 స్టాక్స్ నష్టపోయాయి. 174 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 124 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 125 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 11 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 9 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల సంపద విలువ రూ. 3.3 లక్షల కోట్లు పెరిగింది.
Stock Market | ఎఫ్‌ఎంసీజీ, బ్యాంక్ స్టాక్స్ మినహా..
బీఎస్‌ఈలో ఎఫ్‌ఎంసీజీ(FMCG), బ్యాంక్ స్టాక్స్ మినహా అన్ని ప్రధాన రంగాల సూచీలు లాభాల బాటలో పయనించాయి. మెటల్(Metal) ఇండెక్స్ అత్యధికంగా 2..58 శాతం లాభపడగా.. రియాలిటీ 1.88 శాతం, కమోడిటీ 1.79 శాతం పెరిగాయి. ఆటో ఇండెక్స్ 1.54 శాతం, ఐటీ 1.48 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ 1.37 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 1.29 శాతం, టెలికాం 1.12 శాతం, పీఎస్‌యూ ఇండెక్స్ 1.07 శాతం లాభాలతో ముగిశాయి. ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్ 0.04 శాతం, బ్యాంకెక్స్ 0.02 శాతం నష్టపోయాయి. మిడ్ క్యాప్(Midcap) ఇండెక్స్ 1.11 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.76 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.74 శాతం లాభపడ్డాయి.
Top Gainers : బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 26 కంపెనీలు లాభాలతో.. 4 కంపెనీలు నష్టపపోయాయి. టాటా స్టీల్ 4.31 శాతం, బీఈఎల్ 3.55 శాతం, అదాని పోర్ట్స్ 3.24 శాతం, టెక్ మహీంద్రా 2.53 శాతం, టీసీఎస్ 2.39 శాతం లాభపడ్డాయి.
Losers : పవర్‌గ్రిడ్ 1.01 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 0.99 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.60 శాతం, హెచ్‌యూఎల్ 0.25 శాతం నష్టాలతో ముగిశాయి.