అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kannepalli Pump House | కాళేశ్వరం ప్రాజెక్ట్(Kaleshwaram Project)లో భాగంగా నిర్మించిన కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Ishwar) ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు పంప్‌హౌస్‌ను ముట్టడించారు.
పంప్‌హౌస్(Kannepalli Pump House)లోకి వెళ్లడానికి అనుమతి లేదని వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు, బీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పంపుహౌస్‌లోని మోటార్లు ఆన్ చేసి నీళ్లు విడుదల చేయాలని బీఆర్ఎస్ నాయకులు (BRS Leaders) డిమాండ్ చేశారు. గేట్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈఎన్సీపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండి పడ్డారు. వారం రోజుల్లో పంపులు ఆన్ చేయకుంటే లక్ష మందితో పంపు హౌస్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం (Mahadevpur Mandal) కన్నెపల్లిలో పంప్ హౌస్ నిర్మించారు. ఈ పంప్‌హౌస్‌లో మోటార్లు ఆన్‌చేస్తే రాష్ట్రంలోని లక్షా 50 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. దీని ద్వారా నీరు ఎత్తిపోసి లోయర్ మానేరు, మిడ్‌మానేరుకు నీటిని తరలించొచ్చు.