అక్షరటుడే, వెబ్‌డెస్క్ : AGT Show | ఒక సినిమా హిట్ అయితే అది దేశాలు దాటి సంచలనాలు సృష్టిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే పుష్ప సృష్టించిన సంచలనాలకు ఎన్ని ఉదాహరణలు చెప్పినా తక్కువే అనిపిస్తుంది. సుకుమార్ డైరెక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది. అందులోని బన్నీ సిగ్నేచర్ డైలాగ్ తగ్గేదేలే అయితే దాదాపు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారందరు ఏదో ఒక సందర్భంలో వాడారు. ఇక సినిమాలోని సాంగ్స్ కూడా ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్నాయి. ఆ మధ్య పుష్ప సినిమా(Pushpa Movie)లో సూపర్ హిట్ సాంగ్ ఊ అంటావా మావ ఉ.. ఉ.. అంటావా పాటని ఓ మహిళ తన వయోలిన్(Violin)తో ప్లే చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
AGT Show | పుష్ప ఫీవర్..
ఇప్పుడు పుష్ప ఫీవర్ అమెరికా గాట్ టాలెంట్ (America Got Talent) సీజన్ 20 స్టేజ్‌ని కూడా షేక్ చేసింది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన డ్యాన్స్ గ్రూప్ ‘B Unique Crew’, పుష్ప సినిమాలోని పాటకు అదిరిపోయే ప్రదర్శన ఇచ్చారు. అల్లు అర్జున్ స్టెప్పుల్ని రీ క్రియేట్ చేస్తూ, తమదైన స్టైల్లో పెర్ఫామెన్స్ ఇచ్చిన ఈ గ్రూప్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వచ్చింది. స్టేజ్‌పై జడ్జిలు, ఆడియెన్స్ స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వడం విశేషం. ఈ వీడియోపై ఇండియన్ ఫ్యాన్స్ డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో సోషల్ మీడియాని ఊపేస్తున్నారు. దీంతో #Pushpa హ్యాష్‌ట్యాగ్ మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అల్లు అర్జున్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ ఒక్క వీడియో చాలు అని కొందరు అంటున్నారు. అయితే ఈ వీడియోపై అల్లు అర్జున్ కూడా స్పందించడం విశేషం. వావ్ .. మైండ్ బ్లోయింగ్ అంటూ క్యూట్ కామెంట్ పెట్టారు.
ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇండియన్ సినిమా, ప్రత్యేకంగా తెలుగు సినిమా గ్లోబల్ స్టేజ్(Global Stage)పై ఎలా ప్రభావం చూపుతోందనే దానికి ఇది గొప్ప ఉదాహరణ. “పుష్ప అంటే ఫైర్.. ఇప్పుడు ఆ ఫైర్ అమెరికా(America)లోనూ ప్రభంజనం సృష్టిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, పుష్ప చిత్రం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కగా, ఈ చిత్రం రెండు పార్ట్‌లుగా వచ్చి బాక్సాఫీస్ ని షేక్ చేసింది. పుష్ప చిత్రానికి గాను అల్లు అర్జన్ నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు.