Nizamabad CP
Nizamabad CP | క్రీడలతో ఒత్తిడి దూరం..: సీపీ సాయి చైతన్య

అక్షరటుడే, ఇందూరు: Nizamabad CP | క్రీడలతో ఉద్యోగుల్లో ఒత్తిడి దూరమవుతుందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (Police Commissioner Sai Chaitanya) తెలిపారు. ట్రాన్స్​కో, డిస్కం ఇంటర్ సర్కిల్ హాకీ పోటీలు సోమవారం నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలు ఎంతో అవసరమన్నారు. నిత్యం విధి నిర్వహణలో బిజీగా ఉండే ఉద్యోగులకు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని పేర్కొన్నారు. అలాగే ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులతో (employees) స్నేహం ఏర్పడుతుందన్నారు. దీంతో ఉద్యోగ బాధ్యతలను సులువుగా నిర్వహించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి ఉద్యోగి ఏదో ఒక క్రీడలో సాధన చేయాలని సూచించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకొని పోటీలను ప్రారంభించారు.

Nizamabad CP | విద్యుత్ ఉద్యోగికి సన్మానం

విద్యుత్ సౌదకు చెందిన ఉద్యోగి శ్రీనివాస్ రెడ్డిని సీపీ సన్మానించారు. గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న సేవా కార్యక్రమాలకు గాను గౌరవ డాక్టరేట్ పొందారు. ఈ నేపథ్యంలో ఆయనను సన్మానించారు. పోటీల్లో నిజామాబాద్, కామారెడ్డి, నల్గొండ, కరీంనగర్, విద్యుత్ సౌద హాకీ జట్లు (Hockey teams) పాల్గొన్నాయి.

కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ రామచంద్రరావు, నిజామాబాద్ ఎస్ఈ రాపల్లి రవీందర్, కామారెడ్డి ఎస్ఈ శ్రావణ్ కుమార్, ట్రాన్స్​కో రాష్ట్ర స్పోర్ట్స్ ఆఫీసర్ జగన్నాథ్, డైరెక్టర్లు తిరుపతి రెడ్డి, మోహన్, మధుసూదన్, టోర్నమెంట్ ఆర్గనైజింగ్ ఏడీఈ తోట రాజశేఖర్, డీఈలు రమేష్, విక్రమ్, ఏఏవో గంగారం నాయక్, జేఏవో సురేష్ కుమార్, ఏడీఈ బాలేష్ కుమార్, శంకర్ నాయక్, స్పోర్ట్స్ సెక్రెటరీ గోపి, పీవో పోశెట్టి, స్పోర్ట్స్ కౌన్సిల్ ఉత్తమ్​, సునీత, వివిధ సంఘాల నాయకులు రాజేందర్, గంగాధర్, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.