ePaper
More
    HomeతెలంగాణBRS MLAs | అసెంబ్లీ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ధ‌ర్నా.. ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై వేటు వేయాల‌ని...

    BRS MLAs | అసెంబ్లీ ఎదుట బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ధ‌ర్నా.. ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై వేటు వేయాల‌ని డిమాండ్‌

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: BRS MLAs | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సోమ‌వారం అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో ధ‌ర్నా నిర్వ‌హించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల‌పై త‌క్ష‌ణ‌మే అన‌ర్హ‌త వేటు వేయాల‌ని డిమాండ్ చేశారు.

    తెలంగాణ‌లో పార్టీ ఫిరాయించిన ప‌ది మంది ఎమ్మెల్యేల‌పై బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదుపై వీలైనంత త్వ‌ర‌గా లేదా మూడు నెల‌ల్లో నిర్ణ‌యం తీసుకోవాల‌ని సుప్రీంకోర్టు (Supreme Court) ఇటీవ‌ల ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేర‌కు త్వరతగతిన నిర్ణయం తీసుకోవాలని స్పీక‌ర్‌ను క‌లవాల‌ని భావించారు. స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్‌కుమార్‌ను (Speaker Gaddam Prasad Kumar)  క‌లిసి త‌క్ష‌ణ‌మే నిర్ణ‌యం తీసుకోవాల‌ని కోరేందుకు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు సోమ‌వారం ఉద‌యం అసెంబ్లీకి వ‌చ్చారు.

    BRS MLAs | అందుబాటులో లేని స్పీక‌ర్‌..

    బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు (BRS party MLAs) గంగుల క‌మ‌లాక‌ర్‌, త‌ల‌సాని శ్రీ‌నివాస్‌యాద‌వ్‌, పాడి కౌశిక్‌రెడ్డి స‌హా ప‌ది మంది శాస‌న‌స‌భ్యులు అసెంబ్లీకి చ్చారు. అయితే, ఆయ‌న అందుబాటులోకి లేక‌పోవ‌డంతో ఎమ్మెల్యేలు ధ‌ర్నా నిర్వ‌హించారు. అసెంబ్లీ (Telangana Assembly) ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు బీఆర్‌ఎస్ నిర‌స‌న తెలిపారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని నినాదాలు చేశారు. అయితే, నిర‌స‌న విర‌మించాల‌ని పోలీసులు కోర‌గా, అందుకు వారు నిరాక‌రించారు. శాస‌న‌స‌భ ఆవ‌ర‌ణ‌లో ధ‌ర్నాలు నిర్వ‌హించ‌వ‌ద్దనిసూచించినా ప‌ట్టించుకోలేదు. మ‌రోవైపు, మీడియాను అనుమ‌తించ‌క పోవ‌డంపై ఎమ్మెల్యేలు అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. అయితే, శాస‌న‌స‌భ ఆవ‌ర‌ణ‌ల‌తో మీడియాను అనుమ‌తించ‌క పోవ‌డంపై పోలీసులు, జ‌ర్న‌లిస్టుల‌కు కాసేపు వాగ్వాదం జ‌రిగింది. ధ‌ర్నా అనంతరం గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.

    READ ALSO  Supreme Court | నిజమైన భారతీయులు అలా మాట్లాడరు.. రాహుల్​ గాంధీకి సుప్రీంకోర్టు మొట్టికాయలు

    Latest articles

    Mohammed Siraj | సిరాజ్‌పై తెలంగాణ పోలీసుల ప్ర‌శంస‌ల వ‌ర్షం.. కొత్త డిమాండ్‌కి తెర‌లేపిన ఫ్యాన్స్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mohammed Siraj | టీమిండియా (Team India) స్టార్ పేసర్ బౌలర్​ మహ్మద్ సిరాజ్...

    Forest Department | బైరాపూర్​లో ఉద్రిక్తత.. పురుగుల మందు తాగిన రైతు

    అక్షరటుడే, నిజామాబాద్​ రూరల్​: Forest Department | మోపాల్ (Mopal)​ మండలలోని బైరాపూర్​లో (Birapur) ఉద్రిక్తత నెలకొంది. అటవీశాఖాధికారుల...

    Hyperloop system | దేశ రవాణా రంగంలో మరో మైలు రాయి.. స్వదేశీ హైపర్‌లూప్ వ్యవస్థ అభివృద్ధికి BEML, TuTr మధ్య ఒప్పందం

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hyperloop system | రవాణా రంగంలో (transportation sector) దేశం విప్లవాత్మకమైన అడుగులు వేస్తోంది. ఇందులో...

    Transco Sports | క్రీడలతో ఒత్తిడి దూరం..

    అక్షరటుడే, ఇందూరు: Transco Sports | క్రీడలతో ఒత్తిడి దూరం అవుతుందని.. ఓటమి గెలుపునకు నాంది అని టీఎస్...

    More like this