అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Stock Market | అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నా.. దేశీయ స్టాక్ మార్కెట్లు (domestic stock markets) మాత్రం కొత్త వారాన్ని లాభాలతో ప్రారంభించాయి. తీవ్ర ఒడిదుడుకుల మధ్య లాభాలతో కొనసాగుతున్నాయి.
సోమవారం ఉదయం సెన్సెక్స్ (Sensex) 166 పాయింట్ల లాభంతో ప్రారంభమై అక్కడినుంచి మరో 137 పాయింట్లు పెరిగింది. గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో అక్కడినుంచి 402 పాయింట్లు పతనమైంది. 31 పాయింట్ల లాభంతో ప్రారంభమైన నిఫ్టీ.. అక్కడినుంచి మరో 73 పాయింట్లు లాభపడిరది. ఇంట్రాడే గరిష్టాలనుంచి 115 పాయింట్లు క్షీణించింది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఇంట్రాడే గరిష్టాల వద్ద సెన్సెక్స్ 312 పాయింట్ల లాభంతో 80,912 వద్ద, నిఫ్టీ 115 పాయింట్ల లాభంతో 24,680 వద్ద కొనసాగుతున్నాయి.
Stock Market | మిక్స్‌డ్‌గా సూచీలుల..
బీఎస్‌ఈలో ప్రధాన రంగాల సూచీలు మిక్స్‌డ్‌గా ట్రేడ్ అవుతున్నాయి. మెటల్ ఇండెక్స్ అత్యధికంగా 1.71 శాతం లాభపడగా.. ఆటో 1.35 శాతం, కమోడిటీ 1.21 శాతం, ఎనర్జీ 0.42 శాతం, రియాలిటీ 0.38 శాతం, పీఎస్‌యూ బ్యాంక్, పీఎస్‌యూ ఇండెక్స్‌లు 0.36 శాతం లాభాలతో కొనసాగుతున్నాయి. పవర్ ఇండెక్స్ 0.35 శాతం, యుటిలిటీ 0.23 శాతం, ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్ 0.14 శాతం నష్టాలతో ఉన్నాయి. లార్జ్ క్యాప్ ఇండెక్స్ (Large Cap Index) 0.41 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.15 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.01 శాతం లాభాలతో ఉన్నాయి.
Stock Market | Top gainers..
బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో (BSE Sensex) 21 కంపెనీలు లాభాలతో ఉండగా.. 9 కంపెనీలు నష్టాలతో సాగుతున్నాయి. టాటా స్టీల్ 2.48 శాతం, బీఈఎల్ 2.37 శాతం, ఎం అండ్ ఎం 1.64 శాతం, అదాని పోర్ట్స్ 1.56 శాతం, రిలయన్స్ 1.38 శాతం లాభాలతో కొనసాగుతున్నాయి.
Stock Market | Top losers..
పవర్‌గ్రిడ్ 0.76 శాతం, ఎటర్నల్ 0.66 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ 0.47 శాతంం, ఎన్‌బీఐ 0.44 శాతం, ఇన్ఫోసిస్ 0.36 శాతం నష్టాలతో ఉన్నాయి.