Shibu Soren
Shibu Soren | జార్ఖండ్​ మాజీ సీఎం శిబుసోరెన్ కన్నుమూత

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shibu Soren | జార్ఖండ్​ మాజీ ముఖ్యమంత్రి (Jharkhand  Former CM) శిబు సోరెన్​ (81) మృతి చెందారు. జార్ఖండ్​ ముక్తి మోర్చా సహ వ్యవస్థాపకుడైన శిబు సోరెన్ సోమవారం ఉదయం మృతి చెందినట్లు ఆయన కుమారుడు, జార్ఖండ్​ ముఖ్యమంత్రి హేమంత్​ సోరెన్ (Hemant Soren) తెలిపారు.

శిబు సోరెన్​ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మూత్రపిండాలకు సంబంధించిన సమస్యతో ఢిల్లీలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం ఉదయం 8:56 గంటలకు మరణించారు. ఆయన నెల రోజులుగా లైఫ్​ సపోర్ట్​పై ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

Shibu Soren | మూడు సార్లు ముఖ్యమంత్రిగా..

శిబు సోరెన్​ జార్ఖండ్ రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పని చేశారు. దుమ్కా ఎంపీగా ఎనిమిది సార్లు గెలుపొందారు. 2005లో 10 రోజులపాటు జార్ఖండ్ ముఖ్యమంత్రిగా పని చేశారు. 2008–09, 2009–10 వరకు మొత్తం మూడు సార్లు ఆయన సీఎం బాధ్యతలు నిర్వర్తించారు. జార్ఖండ్​ ముక్తి మోర్చా (JMM) ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించాడు. 38 ఏళ్లుగా జార్ఖండ్ ముక్తి మోర్చాకు నాయకుడిగా ఉన్నారు. ఈ పార్టీని బినోద్​ బిహారీ మహతోతో కలిసి స్థాపించారు.

శిబు సోరెన్​కు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. రెండో కుమారుడు హేమంత్​ సోరెన్​ ప్రస్తుతం జార్ఖండ్​ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. కాగా శిబు సోరెన్​ గతంలో కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు.