అక్షరటుడే, వెబ్‌డెస్క్: IND vs ENG : ఇంగ్లండ్ – భారత్ India మధ్య జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ fifth Test match ఉత్కంఠగా కొనసాగుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్న ఈ మ్యాచ్‌లో విజయం కోసం ఇరు జట్లు పోరాటం చేస్తున్నాయి.
నాలుగో రోజు ఆటలో పరిస్థితులు వరుస మలుపులతో ప్రేక్షకులను ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఉదయం సెషన్‌లో భారత్ ఆధిక్యంలోకి వచ్చిందనుకుంటే, మద్యాహ్నానికే ఇంగ్లండ్ దూసుకెళ్లింది. కానీ చివరి సెషన్‌లో భారత్ మళ్లీ పుంజుకుని ఇంగ్లండ్ England పై ఒత్తిడి పెంచింది. అలా సాగుతున్న మ్యాచ్‌లో సడెన్‌గా వెలుతురు లేకపోవడంతో ఆటను నిలిపివేయాల్సి వచ్చింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 76.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 339 పరుగులు చేసింది.
IND vs ENG : థ్రిల్లింగ్ గేమ్..
ఇంకా 35 పరుగులు అవసరమైన ఈ సమయంలో జెమీ ఓవర్టన్ (0*), జెమీ స్మిత్ (2*) క్రీజులో ఉన్నారు. భారత జట్టు విజయానికి కేవలం నాలుగు వికెట్లు మాత్రమే తీయాల్సి ఉంది. గాయంతో తొలి ఇన్నింగ్స్‌కి దూరంగా ఉన్న క్రిస్ వోక్స్ Woakes అవసరమైతే బ్యాటింగ్‌కి రావడానికి సిద్ధమయ్యారు. వెలుతురు తక్కువగా ఉండటంతో మ్యాచ్ ఆగిపోయింది.
ఇదే సమయంలో మరో నాలుగు ఓవర్ల తర్వాత కొత్త బంతి అందుబాటులోకి రానుండటం టీమిండియాకు పెద్ద అవకాశంగా కనిపించింది. తేమతో కూడిన వాతావరణం, స్వింగ్‌కు అనుకూల పరిస్థితులు భారత బౌలర్లకు కలిసొచ్చేవి. కానీ బ్యాడ్ లైట్ వల్ల ఆ ఛాన్స్ మిస్ అయింది.
374 పరుగుల లక్ష్యంతో ఇంగ్లండ్ నాలుగో రోజు ఆటను 50/1తో ప్రారంభించింది. ఇండియన్ బౌలర్లు ఆరంభంలోనే ఒత్తిడి పెంచారు. డకెట్(54)ను ప్రసిధ్ కృష్ణ అవుట్ చేయగా, కెప్టెన్ ఓలీ పోప్ Ollie Pope (27)ను సిరాజ్ అద్భుత డెలివరీతో ఎల్బీ చేశారు. అనంతరం క్రీజులోకి వచ్చిన హ్యారీ బ్రూక్ – జో రూట్ జోడీ మ్యాచ్ ని ఇంగ్లండ్ వైపు తిప్పింది. ఒక దశలో బ్రూక్ క్యాచ్ ఇచ్చినా… సిరాజ్ బంతిని అందుకొని బౌండరీ లైన్ టచ్ చేయడంతో మంచి అవకాశం పోయింది. దాంతో చెలరేగి ఆడిన బ్రూక్ 111 పరుగులు (98 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లు) చేసి ఔట్ అయ్యాడు.
మరోవైపు జో రూట్ తన 39వ టెస్ట్ సెంచరీ పూర్తి చేశాడు. ఇంగ్లండ్ దూసుకెళ్తుందనిపించిన సమయంలో ప్రసిధ్ కృష్ణ వరుసగా రెండు కీలక వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. జాకోబ్ బెతెల్‌ను బౌల్డ్ చేసిన ప్రసిధ్, జో రూట్‌ను కీపర్ క్యాచ్ ద్వారా పెవిలియన్ చేర్చాడు. అనంతరం సిరాజ్, ప్రసిధ్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో స్మిత్ Smith, ఓవర్టన్ క్రీజులో స్థిరపడలేక తడబడ్డారు.
అదే సమయంలో వెలుతురు తగ్గడంతో మ్యాచ్ నిలిచిపోయింది. తరువాత వర్షం రావడంతో నాలుగో రోజు ఆటను పూర్తిగా ముగించారు. ఐదో రోజు ఆట ప్రారంభమైతే, మ్యాచ్ ఫలితం ఏ దిశగా వెళ్తుందని అందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.