అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Today Gold Price : అంతర్జాతీయంగా అమెరికా విధించిన సుంకాల ప్రభావం ఇప్పుడు భారత బంగారు Gold మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. ఈ కారణంగా బంగారం ధరలు నిత్యం ఊగిసలాటకు లోనవుతున్నా.. మొత్తంగా చూస్తే ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఒక్కోసారి స్వల్పంగా తగ్గినా, తిరిగి మరుసటి రోజే పెరుగుతున్నాయి.
ప్రస్తుతం మార్కెట్లో తులం బంగారం ధర రూ. లక్ష దాటిపోయింది. అది కూడా జీఎస్టీ కలపకుండానే ఉన్న పరిస్థితి. వెండి ధరలు కూడా రోజు రోజుకి పెరుగుతూ పోతున్నాయి. కొంతమంది నిపుణులు బంగారం ఇంకా పెరగవచ్చు, కానీ వెండి ధర కొంచెం స్థిరపడే అవకాశం ఉంది అని చెప్పుకొస్తున్నారు. బంగారం ధరలు ప్రస్తుతం లక్షకు పైగా ఉండటమే కాదు, వచ్చే రోజుల్లో మరింతగా పెరిగే సూచనలూ కనిపిస్తున్నాయి.
Today Gold Price : తగ్గనంటున్న బంగారం..
బంగారం సాధారణంగా పెళ్లిళ్లు, పండుగలు వంటి సందర్భాల్లో ఎక్కువగా కొనుగోలు చేయబడుతుంది. అయితే ప్రస్తుతం ధరలు సామాన్య ప్రజల ఆర్థిక స్థితికి మించి ఉండటంతో, కొనుగోళ్లు తగ్గే అవకాశం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వ్యాపారులూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆగస్టు 4న బంగారం ధరలు చూస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం (24 carat Gold) ధర రూ. 1,01,340కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం (22 carat gold) ధర రూ. 92,890గా ట్రేడ్ అయింది. నిన్నటితో పోల్చుకుంటే బంగారం ధర స్వల్పంగా తగ్గింది.
ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్) చూస్తే..
- హైదరాబాద్(Hyderabad)లో రూ. 1,01,340 – రూ. 92,890
- విజయవాడ(Vijayawada)లో రూ. 1,01,340 – రూ. 92, 890
- ఢిల్లీలో Delhi రూ. 1,01,490 – రూ. 93,040
- ముంబయి(Mumbai)లో రూ. 1,01,340 – రూ. 92,890
- వడోదర(Vadodara)లో రూ. 1,01,390 – రూ. 92,940
- కోల్‌కతా(Kolkatha)లో రూ. 1,01,340 – రూ. 92,890
- ఇక చెన్నై(Chennai)లో రూ. 1,01,340 – రూ. 92,890
- బెంగళూరు(Bengaluru)లో రూ. 1,01,340 – రూ. 92,890
- కేరళ(Kerala)లో రూ. 1,01,340 – రూ. 92,890
- పుణె(Pune)లో రూ. 1,01,340 – రూ. 92, 890గా నమోదయ్యాయి.
ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి) హైదరాబాద్‌లో Hyderabad రూ. 1,22,900గా ట్రేడ్ కాగా, విజయవాడలో రూ. 1,22,900 , ఢిల్లీలో రూ. 1,12,900 , చెన్నైలో రూ. 1,22,900 , కోల్‌కతాలో రూ. 1,12,900 , కేరళలో రూ. 1,22,900 , ముంబయిలో రూ. 1,12,900 , బెంగళూరులో రూ. 1,12,900 , వడోదరలో రూ. 1,12,900 , అహ్మదాబాద్‌లో రూ. 1,12,900గా ట్రేడ్ అయింది.