Tamil Nadu | భార్య తల నరికి నేరుగా టీవీ ఛానెల్‌కు.. నిందితుడు కానిస్టేబుల్​
Tamil Nadu | భార్య తల నరికి నేరుగా టీవీ ఛానెల్‌కు.. నిందితుడు కానిస్టేబుల్​

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tamil Nadu : తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. చెన్నై(Chennai)లోని టుటికోరిన్ (Tuticorin) ​లో ఓ కానిస్టేబుల్​ తన భార్యను అనుమానించాడు. గొడవపడి ఆమె తల నరికేశాడు. ఆపై ఓ టీవీ ఛానల్​(TV channel)కు వెళ్లాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

భార్య తల నరికి చంపిన వ్యక్తి పేరు తమిళ్​ సెల్వన్‌. ఇతడు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF)లో కానిస్టేబుల్​గా విధులు నిర్వస్తున్నాడు. చెన్నైలో శనివారం అతడిని పోలీసులు అరెస్టు చేశారు. హత్య గురించి మాట్లాడేందుకు నిందితుడు ఓ ఎలక్ట్రానిక్​ మీడియా ఛానెల్‌ను సంప్రదించిన కొద్దిసేపటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు కథనం ప్రకారం.. సదరు సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ టుటికోరిన్(Tuticorin) జిల్లాలోని తలవాయిపురం గ్రామానికి చెందిన వాడు. ఇతగాడు ఉమామహేశ్వరి అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Tamil Nadu : అనుమానం పెనుభూతం..

కాగా, కొన్నాళ్లకు భార్య ప్రవర్తనపై సెల్వన్‌కు అనుమానం వచ్చింది. ఆమె వివాహేతర సంబంధం కలిగి ఉందనే అనుమానం పెనుభూతంగా మారింది. ఇదే విషయమై భార్యతో సెల్వన్​ గొడవపడేవాడు. గత నెల(జులై 31) గొడవ పెద్దగా మారడంతో ఆవేశంలో సెల్వన్​ తన భార్య ఉమా మహేశ్వరి(32) తలను నరికేశాడు.

తన కిరాతకంగా చంపేసిన సెల్వన్​ తర్వాత ఏడేళ్ల కుమార్తె, తొమ్మిదేళ్ల కుమారుడిని వాళ్ల మామ ఇంటి వద్ద దిగబెట్టి పారిపోయాడు.

కాగా, శనివారం సెల్వన్​ ఒక  మీడియా ఛానెల్ కార్యాలయానికి చేరుకున్నాడు. తన భార్యను ఎందుకు హతమార్చాల్సి వచ్చిందో మీడియా ముఖంగా మాట్లాడతానని కోరాడు. కాగా, వారు తేనాంపేట అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ అరోకియా రవీంద్రన్‌కు విషయం తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.