అక్షరటుడే, హైదరాబాద్: Kaleshwaram : కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఆదివారం (ఆగస్టు 3) నిర్వహించిన సమావేశం ముగిసిన కాళేశ్వరం అక్రమాలకు బాధ్యులుగా ఉన్నవారిపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేపట్టాలని కమిషన్ సూచించింది. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్‌రావు, ఈటల పాత్రపై నివేదిక పొందుపర్చింది.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు ఆదేశాలతోనే నిర్మాణాలు చేపట్టినట్లు కమిషన్ గుర్తించింది. ఆర్థికశాఖ, అధికారుల లోపాలపైనా కమిషన్ ఫోకస్ చేసింది. ఇరిగేషన్‌శాఖ పంపిన అంచనాలకు ఆర్థికశాఖ గుడ్డిగా ఆమోదం తెలిపారని కమిషన్ నివేదిక పేర్కొంది.
ఆర్థికశాఖ తన కనీస బాధ్యతలు నిర్వహించలేదని కమిషన్ తన నివేదికలో పొందుపర్చింది. ఈ క్రమంలోనే ఆర్థికశాఖ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ కమిషన్ నివేదిక ఇచ్చింది. ఈ కట్టడాలు జరినప్పుడు అప్పటి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పాత్రను సైతం నివేదికలో పొందుపర్చింది.
Kaleshwaram : రేపు కేబినెట్ భేటీ..
తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet) సోమవారం(ఆగస్టు 4) సమావేశం కానుంది. ఈ మంత్రుల భేటీలో ప్రధానంగా కాళేశ్వరం నివేదికపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేబినెట్‌కు అధ్యయన కమిటీ బ్రీఫ్ రిపోర్ట్ ఇవ్వనుంది.
కేబినెట్ సమావేశం అనంతరం తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో పూర్తి నివేదిక ప్రవేశపెట్టనుంది. ఆపై వివరాలు వెల్లడించనుంది.
Kaleshwaram : సుదీర్ఘ విచారణ..
కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram project) నిర్మాణంలో అవకతవకలు, మేడిగడ్డ కుంగిపోవడంపై విచారణకు ప్రభుత్వం పీసీ ఘోష్ ఛైర్మన్‌గా కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దాదాపు 15 నెలల పాటు సుదీర్ఘంగా విచారణ చేపట్టిన కమిషన్ జులై 31న తన నివేదికను ప్రభుత్వానికి అందించింది.
కాళేశ్వరం కమిషన్ 115 మంది అధికారులు, మాజీ సీఎం కేసీఆర్ (former CM KCR), మాజీ మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, పనులు చేపట్టిన కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులను విచారించింది. సీల్డ్ కవర్లో తన నివేదికను సమర్పించింది. అయితే ఈ నివేదికను అధ్యయనం చేయడానికి ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ అధ్యయనం కూడా పూర్తయింది. సోమవారం కేబినెట్ ఎదుటకు నివేదిక వెళ్లనుంది.