అక్షరటుడే, హైదరాబాద్: Drug racket :గ్రేటర్ హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. గంజాయి, డ్రగ్స్ దందా యథేచ్ఛగా సాగుతోంది. వీటి నియంత్రణకు ప్రభుత్వం ఈగల్ టీం (Eagle Team) ఏర్పాటు చేసినా దందా మాత్రం ఆగడం లేదు.
ఎంతో మంది డ్రగ్స్ కు బానిసలుగా మారారు. ఇటీవల మల్నాడు రెస్టారెంట్ (Malnadu Restaurant) యజమానిని డ్రగ్స్ కేసులో ఈగల్ టీం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నగరంలోని చాలా ప్రాంతాల్లో గంజాయి దొరుకుతోంది.
ఇటీవల ఈగల్ టీం డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి గంజాయికి బానిసైన పలువురిని అదుపులోకి తీసుకుంది. యువత ఎక్కువగా మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
తాజాగా గ్రేటర్ హైదరాబాద్‌లోని మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. కొత్తపేటలో డ్రగ్స్ విక్రయిస్తున్న సందీప్ అనే వ్యక్తిని ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు.
సందీప్ ఇంట్లో ఎక్సైజ్ పోలీసుల సోదాలు చేపట్టారు. సోదాల్లో 13 గ్రాముల MDMA, అరకిలో గంజాయి లభించింది. ఈ కేసుపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.