ePaper
More
    HomeతెలంగాణKCR | ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్​ కీలక సమావేశం

    KCR | ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్​ కీలక సమావేశం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KCR | ఎర్రవల్లిలోని కేసీఆర్​ వ్యవసాయ క్షేత్రంలో (KCR Farm House) బీఆర్​ఎస్​ నాయకులు (BRS Leaders) ఆదివారం కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి హరీశ్​రావు, కరీంనగర్‌ జిల్లా నుంచి కేటీఆర్‌, సంజయ్‌, ఆదిలాబాద్‌ నుంచి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ హాజరయ్యారు. నల్గొండ నుంచి జగదీష్‌ రెడ్డి, నిజామాబాద్‌ నుంచి వేముల ప్రశాంత్‌రెడ్డి హాజరయ్యారు.

    KCR | 8న కరీంనగర్​లో సభ

    బీసీ రిజర్వేషన్ల (BC Reservations) కోసం ఈ నెల 8న బీఆర్​ఎస్​ ఆధ్వర్యంలో కరీంనగర్​లో సభ (Karimnagar Sabha) నిర్వహించనున్నారు. రిజర్వేషన్లపై ఇప్పటికే జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత సోమవారం నిరాహార దీక్ష చేయడానికి సిద్ధమయ్యారు. బీసీ రిజర్వేషన్ల బిల్లులను కేంద్రం ఆమోదించాలని ఈ నెల 6న కాంగ్రెస్ (Congress)​ నాయకులు ఢిల్లీలో ధర్నా చేపట్టనున్నారు. బీఆర్​ఎస్​ ఆధ్వర్యంలో కరీంనగర్​లో పెద్ద ఎత్తున సభ నిర్వహించడానికి నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో సభ ఏర్పాట్లపై కేసీఆర్​ నాయకులకు దిశా నిర్దేశం చేసినట్లు సమాచారం. బీసీ సభకు భారీగా జన సమీకరణ చేయాలని నిర్ణయించారు. అలాగే జిల్లాల్లో రాజకీయ పరిణామాలు, పార్టీ పరిస్థితిపై చర్చించినట్లు తెలిసింది.

    READ ALSO  Banswada Sub collector | భూభారతి దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలి

    KCR | కాళేశ్వరం నివేదికపై..

    కాళేశ్వరం కమిషన్​ (Kaleswaram Commission) జులై 31న ప్రభుత్వానికి నివేదిక అందించింది. ఈ నివేదికపై సోమవారం మంత్రివర్గంలో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో కాళేశ్వరం నివేదికపై బీఆర్​ఎస్​ నాయకులు ఎర్రవల్లిలో చర్చించినట్లు తెలిసింది. నివేదికపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది.. అనంతరం ఎలా ముందుకు వెళ్లాలని మంతనాలు జరిపారు. ఇటీవల ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) వ్యవహారం బీఆర్ఎస్​లో తీవ్ర చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై చర్చించినట్లు తెలిసింది. అలాగే స్థానిక ఎన్నికల (Local Body Elections)పై కేసీఆర్​ నాయకులు పలు సూచనలు చేశారు.

    Latest articles

    KCR | తెలంగాణను ధాన్యాగారంగా మార్చిన కేసీఆర్ కు కారాగారమా? : జీవన్​రెడ్డి

    అక్షరటుడే, ఇందూరు: KCR : తెలంగాణ వరప్రదాయనిగా వరల్డ్ ఫేమస్ కాళేశ్వరం ద్వారా రాష్ట్రాన్ని ధాన్యాగారంగా మార్చిన అపర...

    Ration Rice | 32 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

    అక్షరటుడే, గాంధారి: Ration Rice | ఉచిత రేషన్​ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఎస్సై...

    SI Sunil | సైబర్​ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలి

    అక్షరటుడే, కోటగిరి: SI Sunil | ప్రజలు సైబర్ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సునీల్ సూచించారు....

    BRS | బీఆర్​ఎస్​కు మరో షాక్.. పార్టీని వీడనున్న 10 మంది మాజీ ఎమ్మెల్యేలు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BRS | బీఆర్​ఎస్​ పార్టీకి మరో షాక్​ తగలనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పది మంది...

    More like this