అక్షరటుడే, ఇందూరు: Friendship Day | మానవ జీవితంలో స్నేహం ఎంతో విలువైనదని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా (MLA Dhanpal) అన్నారు. కలం స్నేహం అసోసియేషన్ (kalam Sneham Association) ఆధ్వర్యంలో నగరంలోని ఎల్లమ్మ గుట్ట (Yellamma gutta) మున్నూరు కాపు సంఘంలో (Munnurukapu sangham) స్నేహితుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా సంగీత సాహిత్య కవుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కలం ద్వారా స్నేహాన్ని పెంచుకుంటూ భావాల పరస్పర మార్పిడికి వేదికగా నిలుస్తున్న కలం స్నేహం అసోసియేషన్‌కు అభినందనలు తెలిపారు. సమాజాన్ని చైతన్యం చేయడంలో కవులు, కళాకారుల పాత్ర ఎంతో ముఖ్యమైందన్నారు. కలల పట్ల మహిళలు ఆసక్తి కనబర్చడం అద్భుతం అన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు గోపాల్ ఆచార్య, ఉపాధ్యక్షులు హరిప్రియ, సంగీత కళాకారులు, కవులు పాల్గొన్నారు.