అక్షరటుడే ఇందల్వాయి: Indalwai | రెండు బైక్‌లు ఢీకొని ఒకరు దుర్మరణం చెందిన ఘటన ఇందల్వాయి మండలం గన్నారం(gannaram) వద్ద ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్సై సందీప్ (SI sandeep) తెలిపిన వివరాల ప్రకారం..
ఎత్తు తండాకు (Ethu thanda) చెందిన లాల్‌సింగ్, హర్జు ఇద్దరు వ్యక్తులు బైక్‌పై గన్నారం వద్ద రోడ్డు దాటుతున్నారు. అదే సమయంలో వెనక నుంచి అతి వేగంగా వచ్చిన పల్సర్ బైక్ ఢీకొట్టింది. దీంతో రోడ్డు దాటుతున్న బైక్‌పై ఉన్న ఇద్దరి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో హర్జు(55) అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి లాల్ సింగ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని చికిత్స నిమిత్తం స్థానికులు టోల్ ప్లాజా అంబులెన్స్‌లో జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు.
పల్సర్ వాహనంపై వచ్చిన వ్యక్తి అతివేగంగా, అజాగ్రత్తగా నడపడం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు పేర్కొన్నారు. మృతుడి భార్య బాదవత్ లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.