Medical College
Medical College | మెడికల్​ కళాశాలల అడ్మిషన్లలో స్థానికత జీవోను అమలు చేయాలి

అక్షరటుడే, ఇందూరు: Medical College | మెడికల్ కళాశాలల అడ్మిషన్లలో స్థానికత కోసం తీసుకొచ్చిన జీవో నం.33ని అమలు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్​కు (Bomma Mahesh Kumar Goud) ఆదివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గతంలో 6 నుంచి ఇంటర్ (Inter)​ వరకు ఏదైనా నాలుగేళ్లు తెలంగాణలో చదివిన విద్యార్థులకు స్థానికత (లోకల్) గుర్తింపు ఇచ్చేవారన్నారు.

కానీ కొందరు తెలంగాణలో (Telanagana) అభ్యసించకుండా నకిలీ సర్టిఫికెట్లతో మెడికల్ కళాశాలలో అడ్మిషన్లు పొందారన్నారు. దీంతో ఇక్కడి విద్యార్థులకు అన్యాయం జరిగిందని గుర్తు చేశారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం జీవో నం.33ని తీసుకొచ్చారన్నారు. కానీ కొందరు స్థానికేతరులు కోర్టుకు వెళ్లారని చెప్పుకొచ్చారు. అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యం అవుతుందన్న కారణంతో కోర్టుకు వెళ్లిన వారందరినీ కోర్టు కౌన్సెలింగ్​కు అనుమతిచ్చిందన్నారు.

దీంతో స్థానికేతరులు అడ్మిషన్లు పొందారన్నారు. సీట్లు పొందిన వారిలో కొందరు ఒక్క ఏడాది కూడా తెలంగాణలో చదువుకోలేదని, కావున జీవో.33ని అమలు చేసి ఇక్కడి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో చారి, అంజయ్య, మధు, నరేందర్ రెడ్డి, ఉమేష్, విష్ణు, సంధ్య, ఉమేష్, కృష్ణ కుమార్ తదితరులు పాల్గొన్నారు.