ePaper
More
    HomeజాతీయంEps | పీఎఫ్ చందాదారులకు త్వరలో శుభవార్త.. రూ.వెయ్యి పింఛన్ రూ.3 వేలకు పెంపు

    Eps | పీఎఫ్ చందాదారులకు త్వరలో శుభవార్త.. రూ.వెయ్యి పింఛన్ రూ.3 వేలకు పెంపు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Eps | ప్రావిడెంట్ ఫండ్ చందాదారులకు(Provident Fund subscribers) కేంద్ర ప్రభుత్వం త్వరలోనే తీపుకబురు అందించనుంది. ప్రస్తుతం ఎంప్లాయ్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) కింద ఇస్తున్న పెన్షన్(pension) మొత్తాన్ని పెంచనుంది. ప్రస్తుతం రూ. 1,000 ఉన్న మొత్తాన్ని రూ. 3,000 కు పెంచే అవకాశం ఉందని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు..త్వరలోనే ఈ కనీస పెన్షన్ పెంపు అమలులోకి వచ్చే అవకాశం ఉందన్నారు.

    Eps | లక్షలాది మందికి ప్రయోజనం..

    ఈపీఎస్ అనేది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) నిర్వహించే పదవీ విరమణ పథకం. ఇది పదవీ విరమణ తర్వాత వ్యవస్థీకృత రంగంలోని ఉద్యోగులకు పెన్షన్ను అందిస్తుంది. ఈపీఎస్కు యజమాని ఈపీఎఫ్​కు చెల్లించే వాటాలో కొంత భాగం ద్వారా నిధులు సమకూరుతాయి. ప్రస్తుతం, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(Employees Provident Fund)కు యజమాని చెల్లించే 12% వాటాలో 8.33% వాటా ఉద్యోగుల పెన్షన్ స్కీమ్(ఈపీఎస్)కు వెళుతుండగా, మిగిలిన 3.67% ఈపీఎఫ్​కు వెళుతుంది.

    Eps | చాలా కాలంగా పెంపు ప్రయత్నాలు..

    పెన్షన్​ను పెంచేందుకు చాలా కాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2020లోనే కార్మిక మంత్రిత్వ శాఖ ఈపీఎస్(EPS కింద కనీస పెన్షన్ను నెలకు రూ. 2,000కి పెంచాలని, ఆర్థిక మంత్రిత్వ శాఖకు ప్రతిపాదన పంపింది, కానీ ఆమోదం పొందలేదు. అయితే, మొన్నటి బడ్జెట్కు ముందు చర్చల సందర్భంగా, ఈపీఎస్ రిటైర్డ్ ఉద్యోగుల ప్రతినిధి బృందం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కలిసి ఈపీఎఫ్ పెంపుపై విజ్ఞప్తి చేసింది. కనీస పెన్షన్ను నెలకు రూ. 7,500కి పెంచాలని డిమాండ్ చేసింది., అయితే అప్పుడు వారికి ఎటువంటి హామీ లభించలేదు. ఈపీఎస్ కింద మొత్తం పెన్షనర్ల సంఖ్య దాదాపు 77.85 లక్షలకు పైగా ఉండగా, ఇందులో 36.6 లక్షల మంది ప్రతి నెలా రూ. వెయ్యి చొప్పున కనీస పెన్షన్ పొందుతున్నారు. ఈపీఎస్ మొత్తం కార్పస్ రూ. 8 లక్షల కోట్లకు పైగా ఉంది. ఈ నేపథ్యంలో పెన్షన్ పెంచేందుకు అయ్యే భారాన్ని కార్మిక మంత్రిత్వ శాఖ విశ్లేషిస్తోందని ఓ అధికారి తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో ఈపీఎస్ కింద పెన్షనర్లకు కనీస పెన్షన్ అందించడానికి రూ. 1,223 కోట్లు ఖర్చు చేశారు. ఇది అంతకు ముందు సంవత్సరం కంటే 26% ఎక్కువ.. జీవన వ్యయం పెరిగిన తరుణంలో పెన్షన్ మొత్తాన్ని పెంచాలనిబీజేపీ ఎంపీ బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని పార్లమెంటరీ ప్యానెల్ ఇటీవల కార్మిక శాఖను కోరింది. ఈ నేపథ్యంలోనే పెన్షన్ పెంచే ప్రతిపాదనకు ఆమోదం లభించే అవకాశముంది.

    More like this

    Weather Updates | నేడు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం భారీ వర్షం (Heavy Rain)...

    Indian origin man beheaded | అంత కసినా.. అమెరికాలో భారత సంతతి తల నరికి.. విసిరేశాడు!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Indian origin man beheaded : అమెరికా America లో ఒళ్లుగగుర్పొడిచే దారుణ ఘటన చోటుచేసుకుంది....

    Lorry hits | జాగింగ్ చేసి ఇంటికి వెళ్తుండగా ఢీ కొన్న లారీ.. ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలు.. ఒకరికి సీరియస్

    అక్షరటుడే, కామారెడ్డి : Lorry hits : ఇద్దరు యువకులు రోజూ మాదిరిగానే జాగింగ్ కోసం బయలుదేరారు. జాగింగ్...