ePaper
More
    HomeజాతీయంUttar Pradesh | కాలువ‌లోకి దూసుకెళ్లిన బొలెరో కారు.. డోర్ తెరుచుకోక‌పోవ‌డంతో 11మంది మృతి

    Uttar Pradesh | కాలువ‌లోకి దూసుకెళ్లిన బొలెరో కారు.. డోర్ తెరుచుకోక‌పోవ‌డంతో 11మంది మృతి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Uttar Pradesh | ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో (Gonda district) ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం అందరిని కలిచివేస్తోంది. పృథ్వీనాథ్ ఆలయ (Prithvinath temple) దర్శనానికి బొలెరో వాహనంలో బయలుదేరిన 15 మంది ప్రయాణికులు, దురదృష్టవశాత్తు బెల్వా బహుతా రెహ్రా మోడ్ సమీపంలో పెద్ద ప్రమాదానికి గురయ్యారు.

    భారీ వర్షాల (heavy rains) కారణంగా వాహనం అదుపు తప్పి సరయూ కాలువలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు. మృతుల్లో ఐదుగురు మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నారు. వీరంతా మోతీగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిహాగావ్ గ్రామానికి చెందినవారు. మృతుల్లో బీనా (35), కాజల్ (22), మహాక్ (12), దుర్గేష్, నందిని, అంకిత్, శుభ్, సంజు వర్మ, అంజు, సౌమ్య ఉన్నారు.

    Uttar Pradesh | తీవ్ర విషాదం..

    స్థానికుల కథనం ప్రకారం.. కారు ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులు బయటికి రావడానికి తీవ్రంగా ప్రయత్నించినా, డోర్లు తెరుచుకోకపోవడం, అద్దాలు పగలకపోవడం వల్ల అంతులేని విషాదం చోటు చేసుకుంది. కొందరిని బయటకు తీసేందుకు ప్రయత్నించినా, ఆ సమయంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల చాలా మందిని రక్షించలేకపోయారు. సంఘటనా స్థలంలో తీవ్ర ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) స్పందించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారికి తక్షణ వైద్య సేవలు అందించాలని, బాధిత కుటుంబాలకు అవసరమైన సాయం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

    ఈ ప్రమాదం మరోసారి రోడ్డు భద్రతపై ప్రశ్నలు తలెత్తిస్తోంది. భారీ వర్షాల సమయంలో రోడ్లు జారుడుగా మారడం, వాహనాలపై నియంత్రణ కోల్పోవడం వంటి అంశాలు ఇటువంటి విషాదానికి కారణమవుతున్నాయి. బాధితులు ఓకే కుటుంబానికి చెందడం వల్ల ఈ ఘటన మరింత విషాదంగా మారింది. ఇది ప్రతి డ్రైవర్‌కు, ప్రతి ప్రయాణికుడికి ఒక హెచ్చ‌రిక అని అంటున్నారు.

    Latest articles

    MLA Komati Reddy | పదవుల కోసం కాళ్లు పట్టుకోను.. అవసరమైతే మళ్లీ త్యాగం చేస్తానన్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : MLA Komati Reddy | మంత్రి పదవి రాక కొంతకాలంగా అసంతృప్తితో తరచూ సంచలన...

    Janhvi Kapoor | జాన్వీ క‌పూర్‌కు పిల్లో ఫోబియా… అస‌లు కారణం ఏంటి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Janhvi Kapoor | అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్...

    Stock Market | ఒత్తిడిలో మార్కెట్లు.. మళ్లీ నష్టాల్లోకి సూచీలు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగుతుండడం, రూపాయి విలువ క్షీణిస్తుండడం, ట్రంప్‌ టారిఫ్‌...

    Indalwai | అదుపుతప్పి కారు బోల్తా.. తప్పిన ప్రమాదం

    అక్షరటుడే ఇందల్వాయి: Indalwai | అదుపు తప్పి కారు బోల్తా పడిన ఘటన ఇందల్వాయి మండలంలో మంగళవారం చోటు...

    More like this