ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Bapatla | గ్రానైట్​ క్వారీలో ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

    Bapatla | గ్రానైట్​ క్వారీలో ప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Bapatla | ఆంధ్రప్రదేశ్​లోని బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ గ్రానైట్​ క్వారీలో (Granite quarry) అంచు విరిగి పడడంతో ఆరుగురు కార్మికులు మృతి చెందారు. బాపట్ల జిల్లా బల్లికురవ సమీపంలో సత్య కృష్ణ గ్రానైట్‌ క్వారీ ఉంది. ఈ క్వారీలో ఆదివారం కార్మికులు పని చేస్తున్నారు. ఈ క్రమంలో బండరాళ్లు విరిగిపడడంతో ఆరుగురు మృతి చెందారు.

    గ్రానైట్​ క్వారీలో ప్రమాద సమాచారం అందుకున్న​ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు (Rescue Operation) చేపట్టారు. నలుగురి మృతదేహాలను వెలికి తీశారు. ప్రమాద సమయంలో క్వారీలో 16 మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరంతా ఒడిశాకు చెందిన వారని సమాచారం. ఈ ఘటనలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్వారీ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.

    READ ALSO  Banakacherla Project | బనకచర్లపై లోకేశ్​ వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రుల కౌంటర్​

    Bapatla | సీఎం చంద్రబాబు ఆరా

    బాపట్ల జిల్లాలో జరిగిన క్వారీ ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu) స్పందించారు. ఘటనపై ఆయన అధికారులతో మాట్లాడారు. వివరాలు ఆరా తీశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలనపై విచారణ చేపట్టాలని అధికారులకు సూచించారు.

    Latest articles

    Gautam Gambhir | తొలిసారి గంభీర్ కంట క‌న్నీరు.. మ్యాచ్ అయ్యాక ఎందుకంత ఎమోష‌న‌ల్ అయ్యాడు..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gautam Gambhir | టీ-20 వరల్డ్‌కప్ గెలుచుకున్న త‌ర్వాత ఉన్నత స్థాయిలో ప్రయాణం ప్రారంభించిన...

    Minister Ponguleti | రెవెన్యూ మంత్రి పొంగులేటిని కలిసిన వీఆర్ఏలు

    అక్షరటుడే, భీమ్​గల్ : Minister Ponguleti | గ్రామ పరిపాలన అధికారులుగా (జీపీఓ)లుగా వీఆర్ఏలను నియమించే ప్రక్రియను ప్రారంభించిన...

    India – Russia | “ఈ రోజు.. ఆనాడు”.. ట్రంప్‌కు గ‌ట్టి జ‌వాబిచ్చిన ఆర్మీ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : India - Russia | భార‌త్‌, ర‌ష్యా మ‌ధ్య ర‌క్ష‌ణ ఉత్ప‌త్తుల కొనుగోళ్లు, వాణిజ్య...

    Collector Nizamabad | కుర్నాపల్లిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

    అక్షరటుడే, బోధన్: Collector Nizamabad | ఎడపల్లి మండలం కుర్నాపల్లి (Kurnapalli Village) కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector...

    More like this