ePaper
More
    HomeజాతీయంSnake Bite | పాముపై వింత ప్ర‌యోగం.. అద్దంలో త‌న‌ని తాను చూసుకొని ఏం చేసిందంటే..!

    Snake Bite | పాముపై వింత ప్ర‌యోగం.. అద్దంలో త‌న‌ని తాను చూసుకొని ఏం చేసిందంటే..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Snake Bite | సాధారణంగా పాములు ఎంతో ప్రమాదకరమైన జీవులు అయినా, వాటిని జాగ్రత్తగా వదిలిస్తే ఎవరికీ హాని చేయవు. తమ చుట్టూ ఉన్న పరిసరాల్లో త‌న‌కు ప్ర‌మాదం పొంచి ఉందని భావించినపుడే వాటి నుంచి స్పందన వస్తుంది.

    ప్రత్యేకంగా, పాములకు (Snakes) ముఖ భాగంలో ఉన్న సెన్సింగ్ సిస్టమ్ ద్వారా అవి శత్రువులను గుర్తించగలవు. అవసరమైతే బుసలు కొట్టడం, లేదా కాటేయడం ద్వారా తమను తాము కాపాడుకుంటాయి. ఇలాంటి పాముల ప్రవర్తనపై ఇటీవల ఓ ఆసక్తికర వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ (Viral Video) అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి పాముపై వినూత్న ప్రయోగం చేశాడు. ఆ వీడియో మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది.

    Snake Bite | వినూత్న ప్ర‌యోగం..

    వీడియోలో ఓ స్నేక్ క్యాచర్ పాము ముందుగా ఉండి దాని ప్రవర్తనను గమనించాడు. అతడిని చూసిన పాము తన పడగ విప్పి బుసలు కొడుతూ హెచ్చరించిందంతే కానీ కాటేయలేదు. ఆ తర్వాత, సదరు వ్యక్తి పాముకు ఎదురుగా ఓ అద్దం ఉంచాడు . పాము ఎలా స్పందిస్తుందో తెలుసుకోవాల‌ని అనుకున్నాడు. అయితే పాము అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసి దానిపై బుసలు కొడుతూ ఒక్కసారిగా కాటేసింది. అద్దంలో (Mirror) కనిపిస్తున్నది మరో పాముగా భావించి దాన్ని శత్రువుగా ఊహించి స్పందించిందని భావిస్తున్నారు. మళ్లీ మళ్లీ అద్దాన్ని చూపించినప్పటికీ పాము అదే రీతిలో ఆగ్రహంగా బుసలు కొడుతూ దానిపై దాడి చేసింది.

    READ ALSO  Tirumala | శ్రీవారి భక్తులకు అలర్ట్​.. శ్రీవాణి దర్శన సమయంలో మార్పులు

    ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటివరకు 11.5 మిలియన్లకు పైగా వ్యూస్, 82 వేలకుపైగా లైక్స్‌ను సాధించింది. దీనిపై నెటిజన్ల నుంచి రకరకాల కామెంట్లు వస్తున్నాయి.  తననే చూసుకుని భయపడిన పాము భలే రియాక్ట్ అయిందిగా, ఇది చూశాక నాకు నవ్వు ఆగడం లేదు, స్నేక్ క్యాచర్ (Snake Catcher) ఆలోచన క్రియేటివ్‌గా ఉంది అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో మనకు ఓ విషయాన్ని స్పష్టం చేస్తుంది. పాముల లాంటి జీవాలు తమ పరిసరాలపై ఎంతో స్పష్టమైన అవ‌గాహ‌న‌ కలిగి ఉంటాయి. అవి మనపై కావాల‌ని దాడి చేయ‌వు. తమకు ముప్పు వస్తోందని భావించి అలా ప్రవర్తిస్తాయి. ఇలాంటి ప్రయోగాలు జంతువుల ప్రవర్తనపై అవగాహన పెంచడంలో సహాయపడతాయి కానీ, వాటిని జాగ్రత్తగా, బాధ పెట్టకుండా పరిశీలించాల్సిన అవసరం ఉంది.

    Latest articles

    Janhvi Kapoor | జాన్వీ క‌పూర్‌కి పిల్లో ఫోబియా… అస‌లు కారణం ఏంటి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Janhvi Kapoor | అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్(Janhvi...

    Stock Market | ఒత్తిడిలో మార్కెట్లు.. మళ్లీ నష్టాల్లోకి సూచీలు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగుతుండడం, రూపాయి విలువ క్షీణిస్తుండడం, ట్రంప్‌ టారిఫ్‌...

    Indalwai | అదుపుతప్పి కారు బోల్తా.. తప్పిన ప్రమాదం

    అక్షరటుడే ఇందల్వాయి: Indalwai | అదుపు తప్పి కారు బోల్తా పడిన ఘటన ఇందల్వాయి మండలంలో మంగళవారం చోటు...

    Bheemgal | విద్యుత్ ఉపకేంద్రాన్ని ముట్టడించిన రైతులు

    అక్షరటుడే, భీమ్​గల్: Bheemgal | తమ పంటపొలాలకు విద్యుత్​ సరఫరా సక్రమంగా జరగట్లేదని పేర్కొంటూ రైతులు మంగళవారం బాల్కొండ...

    More like this

    Janhvi Kapoor | జాన్వీ క‌పూర్‌కి పిల్లో ఫోబియా… అస‌లు కారణం ఏంటి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Janhvi Kapoor | అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్(Janhvi...

    Stock Market | ఒత్తిడిలో మార్కెట్లు.. మళ్లీ నష్టాల్లోకి సూచీలు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగుతుండడం, రూపాయి విలువ క్షీణిస్తుండడం, ట్రంప్‌ టారిఫ్‌...

    Indalwai | అదుపుతప్పి కారు బోల్తా.. తప్పిన ప్రమాదం

    అక్షరటుడే ఇందల్వాయి: Indalwai | అదుపు తప్పి కారు బోల్తా పడిన ఘటన ఇందల్వాయి మండలంలో మంగళవారం చోటు...