ePaper
More
    HomeజాతీయంBC Reservations | బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్​ పోరుబాట.. రేపు ఢిల్లీకి నేతల పయనం

    BC Reservations | బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్​ పోరుబాట.. రేపు ఢిల్లీకి నేతల పయనం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : BC Reservations | రాష్ట్రంలో రాజకీయాలు బీసీ రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతున్నాయి. తాము అధికారంలోకి వస్తే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు, విద్యా ఉద్యోగాల్లో (local body elections and educational jobs) 42శాతం రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్​ ప్రకటించింది.

    ఈ మేరకు అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్​ ప్రభుత్వం (Congress government) కుల గణన చేపట్టింది. అనంతరం బీసీ రిజర్వేషన్ల బిల్లులను అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపింది. అయితే కేంద్రం వాటికి అనుమతి తెలపకపోవడంతో స్థానిక ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్​ కల్పిస్తూ ఆర్డినెన్స్​ తీసుకు వచ్చింది. అయితే ఆ ఆర్డినెన్స్​కు గవర్నర్​ ఇంకా ఆమోదం తెలపలేదు. దీంతో కాంగ్రెస్​ నాయకులు కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావాలని నిర్ణయించారు.

    BC Reservations | 6న భారీ ధర్నా

    కాంగ్రెస్​ నాయకులు ఢిల్లీలోని జంతర్​ మంతర్​ వద్ద ఈ నెల 6న భారీ ధర్నా నిర్వహించనున్నారు. బీసీ రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం తెలపాలనే డిమాండ్​తో చేపట్టే ఈ ధర్నాలో సీఎం రేవంత్ (CM revamth reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రులు పాల్గొనున్నారు. భారీ సంఖ్యలో కాంగ్రెస్​ నాయకులు, కార్యకర్తలు సైతం ధర్నాకు తరలి వెళ్లనున్నారు. ఈ క్రమంలో సోమవారం తెలంగాణ కాంగ్రెస్ నేతల (Telangana Congress leaders) ఛలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టారు. ఉదయం 9 గంటలకు చర్లపల్లి నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైలు ఢిల్లీ వెళ్లనుంది. ఈ రైలులో ప్రతి జిల్లా నుంచి 25 మంది కాంగ్రెస్​ నాయకులు ఢిల్లీకి వెళ్లనున్నారు.

    బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం 5న పార్లమెంట్​లో కాంగ్రెస్​ ఎంపీలు (Congress MPs) వాయిదా తీర్మానం ఇవ్వనున్నారు. అనంతరం 6న మహాధర్నా చేపట్టనున్నారు. 7న రాష్ట్రపతి ద్రౌపతి ముర్మును కలిసి బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపాలని వినతి పత్రాలు ఇవ్వనున్నారు.

    Latest articles

    Manda Krishna Madiga | మందకృష్ణను కలిసిన ఎన్ఎస్ఎఫ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు

    అక్షరటుడే, బోధన్ : Manda Krishna Madiga | ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణను ఎన్ఎస్ఎఫ్ యూత్ వెల్ఫేర్...

    Jenda Balaji Festival | నేత్ర పర్వం.. జెండా బాలాజీ ఉత్సవం..

    అక్షరటుడే ఆర్మూర్ : Jenda Balaji Festival | తిరుమల వెళ్లలేని భక్తులకు తమ మొక్కలను.. కానుకలను.. ముడుపులను...

    Cloud Burst | ఉత్తరాఖండ్‌లో క్లౌడ్‌ బరస్ట్‌.. కొట్టుకుపోయిన గ్రామం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cloud Burst | ఉత్తరాఖండ్(Uttarakhand)​లో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. క్లౌడ్​ బరస్ట్(Cloud Burst)​...

    Gautam Gambhir | తొలిసారి గంభీర్ కంట క‌న్నీరు.. మ్యాచ్ అయ్యాక ఎందుకంత ఎమోష‌న‌ల్ అయ్యాడు..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gautam Gambhir | టీ-20 వరల్డ్‌కప్ గెలుచుకున్న త‌ర్వాత ఉన్నత స్థాయిలో ప్రయాణం ప్రారంభించిన...

    More like this