ePaper
More
    HomeతెలంగాణMLC Kavitha | బీఆర్​ఎస్​ పెద్ద నాయకుడు నన్ను తిట్టిస్తున్నాడు.. కవిత సంచలన వ్యాఖ్యలు

    MLC Kavitha | బీఆర్​ఎస్​ పెద్ద నాయకుడు నన్ను తిట్టిస్తున్నాడు.. కవిత సంచలన వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : MLC Kavitha | బీఆర్​ఎస్​కు చెందిన కొందరు తనను తిట్టిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kalvakuntla Kavitha) సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే యావత్​ తెలంగాణ ఖండించిందని కవిత పేర్కొన్నారు. అయితే బీఆర్​ఎస్​ నాయకులు మాత్రం స్పందించడం లేదన్నారు. ఓ లిల్లిపుట్​ నాయకుడు తనను విమర్శించడం ఏమిటని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

    మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్​రెడ్డి (MLA Jagadish Reddy) కవిత గురించి ఇటీవల పలు వ్యాఖ్యలు చేశారు. ఆమె బీఆర్​ఎస్​లో ఉంటే ఎమ్మెల్సీ అని లేకపోతే ఏమి కాదన్నారు. ఆమె గురించి మాట్లాడటం టైమ్​ వేస్ట్​ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై కవిత పరోక్షంగా స్పందించారు. లిల్లీపుట్​ నాయకుడు నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్​ పార్టీని నాశనం చేశారని కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కన్ను లొట్టపోయి గెలిచిన సదరు నాయకుడు.. ఎప్పుడు ప్రజా పోరాటాల్లో పాల్గొనలేదన్నారు. బీఆర్​ఎస్​కు ఆయనకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. పార్టీకి సంబంధం లేని వ్యక్తితో తనపై ఆరోపణలు చేయిస్తున్నారన్నారు. నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన చోటా మోటా లీడర్లతో తనను తిట్టిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వారి వెనుక బీఆర్​ఎస్​కు చెందిన పెద్ద నాయకుడు ఉన్నట్లు కవిత ఆరోపించారు. సమయం వచ్చినప్పుడు అందరి పేర్లు బయట పెడతానని స్పష్టం చేశారు.

    MLC Kavitha | 72 గంటలపాటు నిరాహార దీక్ష

    బీసీ రిజర్వేషన్ల (BC reservations) సాధన కోసం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సోమవారం నుంచి 72 గంటల పాటు నిరవధికంగా నిరాహార దీక్ష చేపట్టనున్నారు. ఈ నెల 4, 5, 6 తేదీల్లో దీక్ష చేపట్టడానికి అనుమతి ఇవ్వాలని ఆమె పోలీసులను కోరారు. అయితే పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో కవిత హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు నుంచి అనుమతి వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

    స్థానిక సంస్థలతో పాటు, విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కవిత డిమాండ్​ చేశారు. ఈ మేరకు తెలంగాణ జాగృతి (Telangana Jagruti) ఆధ్వర్యంలో రౌండ్​ టేబుల్ ​సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంతో పాటు 72 గంటల పాటు తాను నిరాహార దీక్ష చేస్తున్నట్లు కవిత తెలిపారు. ప్రభుత్వం తనకు అనుమతి ఇవ్వాలని కోరారు.

    Latest articles

    Manda Krishna Madiga | మందకృష్ణను కలిసిన ఎన్ఎస్ఎఫ్ యూత్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు

    అక్షరటుడే, బోధన్ : Manda Krishna Madiga | ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణను ఎన్ఎస్ఎఫ్ యూత్ వెల్ఫేర్...

    Jenda Balaji Festival | నేత్ర పర్వం.. జెండా బాలాజీ ఉత్సవం..

    అక్షరటుడే ఆర్మూర్ : Jenda Balaji Festival | తిరుమల వెళ్లలేని భక్తులకు తమ మొక్కలను.. కానుకలను.. ముడుపులను...

    Cloud Burst | ఉత్తరాఖండ్‌లో క్లౌడ్‌ బరస్ట్‌.. కొట్టుకుపోయిన గ్రామం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Cloud Burst | ఉత్తరాఖండ్(Uttarakhand)​లో కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. క్లౌడ్​ బరస్ట్(Cloud Burst)​...

    Gautam Gambhir | తొలిసారి గంభీర్ కంట క‌న్నీరు.. మ్యాచ్ అయ్యాక ఎందుకంత ఎమోష‌న‌ల్ అయ్యాడు..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gautam Gambhir | టీ-20 వరల్డ్‌కప్ గెలుచుకున్న త‌ర్వాత ఉన్నత స్థాయిలో ప్రయాణం ప్రారంభించిన...

    More like this