Kaleshwaram Commission
Kaleshwaram Commission | రేపు కేబినెట్ ముందుకు కాళేశ్వరం నివేదిక.. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో?

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Kaleshwaram Commission | కాళేశ్వరం కమిషన్ నివేదిక సోమవారం మంత్రిమండలికి చేరనుంది. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో కమిషన్​ నివేదికపై చర్చించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​ (Kaleshwaram project) నిర్మాణంలో అవకతవకలు, మేడిగడ్డ కుంగిపోవడంపై విచారణకు ప్రభుత్వం పీసీ ఘోష్​ ఛైర్మన్​గా కమిషన్​ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దాదాపు 15 నెలల పాటు సుదీర్ఘంగా విచారణ చేపట్టిన కమిషన్​ జులై 31న తన నివేదికను ప్రభుత్వానికి అందించింది.

కాళేశ్వరం కమిషన్​ 115 మంది అధికారులు, మాజీ సీఎం కేసీఆర్​ (former CM KCR), మాజీ మంత్రులు హరీశ్​రావు, ఈటల రాజేందర్​, పనులు చేపట్టిన కాంట్రాక్ట్​ సంస్థ ప్రతినిధులను విచారించింది. సీల్డ్​ కవర్​లో తన నివేదికను సమర్పించింది. అయితే ఈ నివేదికను అధ్యయనం చేయడానికి ప్రభుత్వం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. అందజేయనుంది.

Kaleshwaram Commission | కమిటీ సభ్యులతో మంత్రి భేటీ

నిపుణుల కమిటీ సభ్యులతో మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి (Minister Uttam Kumar Reddy) ఆదివారం భేటీ కానున్నారు. కమిషన్‌ నివేదికపై ఇప్పటికే అధికారుల అధ్యయనం పూర్తయినట్లు సమాచారం. సాయంత్రానికి పూర్తిస్థాయిలో నివేదిక సమర్పించనున్నట్లు తెలుస్తోంది. దీంతో వారితో మంత్రి సమావేశమై చర్చించనున్నారు. అలాగే మంత్రి ఉత్తమ్​ సీఎం రేవంత్​రెడ్డితో (CM Revanth Reddy) సైతం సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Kaleshwaram Commission | ఎలాంటి చర్యలు తీసుకుంటారో..

కాళేశ్వరం ప్రాజెక్ట్​లో భారీగా అక్రమాలు జరిగాయని కాంగ్రెస్​ నాయకులు ఆరోపిస్తున్నారు. కేసీఆర్​ కుటుంబం (KCR family) కమీషన్ల కోసమే దీనిని కట్టిందని సీఎం రేవంత్​రెడ్డి సైతం పలుమార్లు వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో కమిషన్​ నివేదికపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది. మంత్రివర్గ సమావేశంలో కమిషన్​ నివేదికపై చర్చించనున్నారు. అనంతరం ప్రభుత్వం వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.