ePaper
More
    Homeఅంతర్జాతీయంViral video | వైర‌ల్ వీడియో.. ఎలుగుబంటితో మందుబాబు కుస్తీ.. చివ‌రికి ఏమైందంటే..!

    Viral video | వైర‌ల్ వీడియో.. ఎలుగుబంటితో మందుబాబు కుస్తీ.. చివ‌రికి ఏమైందంటే..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Viral video | సోష‌ల్ మీడియాలో కొన్నివీడియోలు ఒళ్లు గ‌గుర్పొడిచేలా చేస్తాయి. ఒక్కోసారి ఆ వీడియోలు చూసి భ‌యాందోళ‌న‌కి కూడా గుర‌వుతుంటాం. తాజాగా సోష‌ల్ మీడియాలో (social media) చ‌క్క‌ర్లు కొడుతున్న వీడియోని చూసి అంద‌రు నోరెళ్ల‌పెట్టారు. సాధార‌ణంగా జంతు ప్రదర్శనల శాలలో సందర్శకుల ప్రవర్తనతో పలుమార్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. పులులు, సింహాల వంటి ప్రమాదకర జంతువుల సమీపానికి వెళ్లే వారి వల్ల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ (Viral Video) అవుతోంది. ఈ ఘటన పోలాండ్‌లోని (Poland) వార్సా జూలో చోటు చేసుకుంది.

    Viral video | బతికి బ‌ట్ట‌క‌ట్టాడు

    వివరాల్లోకి వెళ్తే 23 ఏళ్ల ఓ యువకుడు మద్యం సేవించి జూలోకి (Zoo) వెళ్లాడు. అక్కడ ఉన్న జంతువులను దూరం నుంచి చూడ‌కుండా ఏకంగా ఎలుగుబంటి ఎన్‌క్లోజర్‌లోకి దూకేశాడు. దానిని దగ్గరగా చూడాలన్న ఆశతో అడుగులు వేశాడు. అనంతరం ఎలుగుబంటి తన వైపునకు వ‌స్తుంద‌ని గ‌మ‌నించిన‌ ఆ యువకుడు ఒక్కసారిగా భయంతో నీళ్లలోకి దూకేశాడు. కానీ ఎలుగుబంటి ఆగలేదు. అది కూడా నీళ్లలోకి దూకి అతనిపై దాడికి యత్నించింది. యువకుడు ఎలుగుబంటిని నీళ్లలో ముంచి దాన్ని అడ్డుకున్నాడు. మధ్యలో ఎలుగుబంటి మళ్లీ పైకి రావడానికి ప్రయత్నించినా అతను ధైర్యంగా దాన్ని తోసి దూరం నెట్టాడు. ఈ సమయంలో అక్కడికి చేరుకున్న సెక్యూరిటీ సిబ్బంది అతన్ని బయటకు తీశారు.

    READ ALSO  Bala Krishna | పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో సైకిల్ ఎక్క‌లేక కుస్తీలు ప‌డ్డ బాల‌య్య‌.. వైర‌ల్ అవుతున్న వీడియో

    ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. ఆ వీడియోకు ఇప్పటికే 2.2 మిలియన్లకు పైగా వ్యూస్, 12 వేలపై చిలుకు లైక్​లు వచ్చాయి. దీనిపై నెటిజన్లు ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేస్తున్నారు. మందుబాబు ఏకంగా ఎలుగుబంటితో (Bear) యుద్ధమే చేశాడు.. అదృష్టం అత‌డిని కాపాడింది అంటూ విభిన్న కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైన అత‌నికి భూమి మీద నూక‌లు ఉన్నాయి కాబ‌ట్టి సేఫ్‌గా బ‌య‌ట‌ప‌డ్డాడు. ఇలాంటి ఘ‌ట‌న‌లు మ‌న దేశంలో కూడా చాలానే జ‌రిగాయి.

    Latest articles

    Aditya Infotech | అదరగొట్టిన ‘ఆదిత్య’.. ఇన్వెస్టర్లను ముంచేసిన కాయ్‌టెక్స్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Aditya Infotech | దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో మంగళవారం మూడు కంపెనీలు లిస్టయ్యాయి. ఇందులో...

    Register Post | పోస్టల్ శాఖ సంచలన నిర్ణయం.. నిలిచిపోనున్న రిజిస్టర్​ పోస్ట్​ సేవలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Register Post | పోస్టల్​ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. రిజిస్టర్​ పోస్ట్​ సేవలను నిలిపి...

    Deepika Padukone | రికార్డుల‌కెక్కిన దీపికా పదుకొనే.. ప్ర‌పంచంలోనే అత్య‌ధిక వ్యూస్ దాటిన ఆమె రీల్‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Deepika Padukone | బాలీవుడ్ నటి దీపికా పదుకొనే అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు....

    Harish Rao | బీఆర్​ఎస్​పై ఆ రెండు పార్టీలు కుట్ర చేస్తున్నాయి.. హరీశ్​రావు సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao | కాంగ్రెస్​, బీజేపీ కలిసి బీఆర్​ఎస్​పై కుట్ర చేస్తున్నాయని మాజీ మంత్రి...

    More like this