Operation Akhal
Operation Akhal | జమ్మూ కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ముగ్గురు టెర్రరిస్టుల హతం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Operation Akhal | జమ్మూ కశ్మీర్​ (Jammu and Kashmir)లో భారీ ఎన్​కౌంటర్ (Encounter)​ చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఎన్​కౌంటర్​లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. జమ్మూకశ్మీర్​లోని కుల్గాం (Kulgam) జిల్లాలో టెర్రరిస్టులు ఉన్నారనే సమచారం మేరకు బలగాలు శుక్రవారం సెర్చ్​ ఆపరేషన్​ ప్రారంభించాయి.

ఈ క్రమంలో శనివారం ఉగ్రవాదులు బలగాలపై కాల్పులకు పాల్పడ్డాయి. ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఎన్​కౌంటర్​లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. అనంతరం ఆదివారం సైతం కూంబింగ్ (Coombing)​ చేపట్టగా.. జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్టులు హతం అయ్యారు. ఈ ఘటనలో ఒక జవాన్​ గాయపడ్డారు. బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.

Operation Akhal | డ్రోన్​లతో గాలింపు

కుల్గాం జిల్లాలోని అఖల్​ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదుల జాడ కోసం బలగాలు సాంకేతికతను వినియోగిస్తున్నాయి. డ్రోన్‌లు, థర్మల్ ఇమేజింగ్ పరికరాలను ఉపయోగించి టెర్రరిస్టుల కోసం అడవులను జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం కాల్పులు చోటు చేసుకున్నాయి. భారీ సంఖ్యలో బలగాలను అక్కడికి రప్పించారు. సెర్చ్​ ఆపరేషన్​ (Search Operation) ముమ్మరం చేయడంతో ఆపరేషన్​ అఖల్​లో ఇప్పటి వరకు ఐదుగురు ఉగ్రవాదులు హతం అయ్యారు. ఈ ఆపరేషన్​లో భారత సైన్యం, జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్​పీఎఫ్​, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) సభ్యులు పాల్గొన్నారు.

Operation Akhal | ఉగ్రవాదుల ఆట కట్టిస్తున్న బలగాలు

జమ్మూ కశ్మీర్​లో పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack) తర్వాత బలగాలు టెర్రరిస్టుల పని పడుతున్నాయి. ఏప్రిల్​ 22న ఈ ఘటన చోటు చేసుకోగా.. అప్పటి నుంచి ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇటీవల ఆపరేషన్​ మహదేవ్ (Operation Mahadev)​ చేపట్టి పహల్గామ్​ దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదులను మట్టు బెట్టాయి. పహల్గామ్​ దాడి జరిగిన తర్వాత బలగాలు ఇప్పటి వరకు 17 మంది ఉగ్రవాదులు ఎన్​కౌంటర్​లలో హతం అయ్యారు. ఆపరేషన్​ అఖల్​ ఇంకా కొనసాగుతోందని అధికారులు తెలిపారు.