Ind vs Eng
Ind vs Eng | విజ‌యానికి 8 వికెట్ల దూరంలో భార‌త్.. 123 ఏళ్ల రికార్డు బ‌ద్ద‌లు కొడ‌తారా?

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Ind vs Eng | ఇంగ్లండ్‌తో England జ‌రుగుతున్న ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఓవ‌ల్ వేదిక‌గా చివ‌రి టెస్ట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగుతుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయానికి చేరువవుతోంది. ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్‌లో భారత్ గట్టి పట్టు సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో 23 పరుగుల వెనుకబడినప్పటికీ, రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగుల భారీ స్కోర్ చేసి మ్యాచ్‌ను తన దిశగా తిప్పుకుంది. జైస్వాల్ సెంచరీ, ఆకాశ్ దీప్, జ‌డేజా, సుందర్ హాఫ్ సెంచరీలతో రాణించ‌గా, ఈ బ్యాటర్ల రాణింపు టీమిండియా విజ‌యంలో ముఖ్యపాత్ర పోషించనుంది. యశస్వి జైస్వాల్ (164 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్స్‌లతో 118 ప‌రుగులు), ఆకాష్ దీప్ (94 బంతుల్లో 12 ఫోర్లతో 66 పరుగులు) చేయ‌గా, రవీంద్ర జడేజా (77 బంతుల్లో 53 పరుగులు (5 ఫోర్లు), వాషింగ్టన్ సుందర్ (46 బంతుల్లో 53 పరుగులు (4 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుతంగా రాణించారు.

Ind vs Eng | ఏం చేస్తారో మ‌రి..!

ఐదు వికెట్లు తీసిన జోష్ టంగ్ (5/125) ఇంగ్లండ్ బౌలింగ్‌లో కీలకంగా నిలిచాడు. అతనికి తోడుగా గస్ అట్కిన్సన్ (3/127) మరియు జెమీ ఓవర్టన్ (2/98) ప‌ర్వాలేద‌నిపించారు. అయితే భారత్​ బ్యాటింగ్ ముగిసిన తర్వాత, ఇంగ్లండ్‌కు గెలవాలంటే 374 పరుగుల భారీ లక్ష్యం కావాల్సి ఉంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి, 13.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 50 పరుగులు చేశారు. బెన్ డకెట్ – 34*, జాక్ క్రాలీ Crwaley – 14 పరుగులు చేశారు. ఇంగ్లండ్ గెల‌వ‌డానికి ఇంకా 324 పరుగులు అవసరం కాగా, భారత్‌కు కావాల్సిన‌వి 8 వికెట్లు మాత్ర‌మే. వోక్స్ గాయ‌ప‌డ‌డంతో తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయ‌లేదు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా వోక్స్ గ్రౌండ్‌లో అడుగుపెట్టే అవకాశం లేదు. ఇక ఈ మ్యాచ్‌లో భార‌త్ గెలిస్తే ఐదు టెస్ట్‌ల సిరీస్ డ్రా అవుతుంది. భార‌త్ గెలుపోట‌ములు ఇప్పుడు భార‌త బౌల‌ర్స్ చేతిలో ఉంది.

ఓవల్ మైదానంలో నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక రన్ ఛేజ్ రికార్డు 1902లో నమోదు కాగా, అప్పట్లో ఆస్ట్రేలియా Australia నిర్దేశించిన 263 పరుగుల లక్ష్యాన్నిఇంగ్లండ్ టీమ్ ఛేజ్ చేసింది. మ‌రి ఇప్పుడు ఇంగ్లాండ్ ఈ 374 పరుగులు ఛేజ్ చేయాలంటే 123 సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టాలి. ఈ లక్ష్యాన్ని చేరుకోవడం ఇంగ్లాండ్‌కు అంత సులభం కాదు. ఓవ‌ల్ మైదానంలో 148 సంవత్సరాల టెస్ట్ చరిత్రలో, 300 పరుగుల కంటే ఎక్కువ లక్ష్యాన్ని ఛేజించింది ఒక్క‌సారి కూడా లేదు. ఇక్కడ 100 క‌న్నా ఎక్కువ టెస్ట్ మ్యాచ్‌లు జర‌గ‌గా, చివరి ఇన్నింగ్స్‌లో లక్ష్యాన్ని ఛేదించి మ్యాచ్ గెలిచింది కేవ‌లం 22 సార్లు మాత్రమే. మ‌రి ఈ రోజు ఎలాంటి అద్భుతాలు జ‌రుగుతాయో చూడాలి.