ePaper
More
    HomeతెలంగాణPCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్...

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ హయాం గురించి మాట్లాడుతూ ఆవేశం మాట్లాడిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​ అవుతున్నాయి. మన పీసీసీ చీఫ్​ గణాంకాలను చూసి అందరూ షాక్​ అవుతున్నారు. ఆ తర్వాత కడుపుబ్బా నవ్వుకుంటున్నారు.

    గత బీఆర్​ఎస్​ పాలనపై ఆవేశంగా మాట్లాడిన పీసీసీ చీఫ్​.. అప్పులపై తప్పులు వల్లించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రానికి ఏకంగా ‘రూ. 8 లక్షలు’ అప్పు చేసి ఫాం హౌజ్​లో పడుకున్నారని మహేష్​కుమార్​ గౌడ్​ ఆవేశంగా వ్యాఖ్యానించారు.

    PCC Chief : ఆర్మూర్​లో పాదయాత్ర..

    నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​లో కాంగ్రెస్​ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్ Meenakshi Natarajan శనివారం (ఆగస్టు 2)​ పాదయాత్ర చేపట్టారు. ముందుగా ఆలూర్​ బైపాస్​లో కాంగ్రెస్​ జెండా ఎగురవేశారు. అనంతరం మీనాక్షి నటరాజన్​, పీసీసీ చీఫ్​ బొమ్మ మహేష్​​ కుమార్​ గౌడ్​ (PCC Chief Bomma Mahesh Kumar Goud) పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేష్​కుమార్​ గౌడ్​ ప్రసంగించారు.

    READ ALSO  Meenakshi Natarajan | రేపు ఆర్మూర్​లో మీనాక్షి నటరాజన్​ పాదయాత్ర

    మాజీ సీఎం కేసీఆర్​ను టార్గెట్​ చేస్తూ.. మహేష్​ కుమార్​ గౌడ్​ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. కానీ, తాను ఏమి మాట్లాడుతున్నాననే విషయాన్ని మాత్రం గ్రహించలేకపోయారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో గత పదేళ్లలో కేసీఆర్​ చేసిన అప్పులు రూ. 8 లక్షలు అంటూ చెప్పుకొచ్చారు.

    కేసీఆర్ చేసిన అప్పులకు రూ. 6 కోట్ల అప్పులు చెల్లిస్తున్నామంటూ ఆవేశంతో ఊగిపోయారు. కాగా, ఆయన మాటలు విని కాంగ్రెస్​ నేతలే ఖంగుతిన్నారు. ఇక, ప్రజలైతే తలలు గోక్కున్నారు.

    PCC Chief : సోషల్​ మీడియాలో ట్రోల్​..

    తెలంగాణ పీసీసీ చీఫ్​ మహేష్​కుమార్​ గౌడ్​ గణిత జ్ఞానం ప్రస్తుతం నెట్టింట వైరల్​ అవుతోంది. రూ. 8 లక్షల కోట్లు అనాల్సింది.. రూ. 8 లక్షలు అనటంపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.

    Latest articles

    Indalwai | ఒకరి అతివేగం.. మరొకరి ప్రాణం తీసింది.. హైవేపై రెండు బైకులు ఢీకొని ఒకరి దుర్మరణం

    అక్షరటుడే ఇందల్వాయి: Indalwai | రెండు బైక్​లు ఢీకొని ఒకరు దుర్మరణం చెందిన ఘటన ఇందల్వాయి మండలం గన్నారం(gannaram)...

    Meenakshi Natarajan | పార్టీ కోసం పనిచేసినవారికి తగిన గుర్తింపు

    అక్షరటుడే, ఆర్మూర్‌ : Meenakshi Natarajan | పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని...

    Medical College | మెడికల్​ కళాశాలల అడ్మిషన్లలో స్థానికత జీవోను అమలు చేయాలి

    అక్షరటుడే, ఇందూరు: Medical College | మెడికల్ కళాశాలల అడ్మిషన్లలో స్థానికత కోసం తీసుకొచ్చిన జీవో నం.33ని అమలు...

    Earthquake in russia | రష్యాలో మళ్లీ భారీ భూకంపం.. బద్దలైన అగ్ని పర్వతం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Earthquake in russia | రష్యాలో వరుస భూకంపాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. బుధవారం...

    More like this