ePaper
More
    HomeజాతీయంUttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక మహిళ తన భర్తను చంపేస్తానని భయభ్రాంతులకు గురిచేసింది. ఆమె తన ప్రేమికుడితో కలిసి భర్తను బెదిరించింది. తన భర్తను చంపి, నీలిరంగు డ్రమ్‌లో పాతిపెడతానని హెచ్చరించింది. దీంతో భయపడిపోయిన భర్త.. తన భార్యకు, ఆమె ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆలయంలో ఈ వివాహ తంతు జరిగింది. తనను చంపేస్తానని చాలాసార్లు తన పెళ్లాం బెదిరించిందని బాధితుడు వాపోయాడు. ఈ ఘటన స్థానికంగా చర్చకు దారితీసింది.

    చౌరిచౌరా పోలీస్ స్టేషన్ (Chauri Chaura police station) పరిధిలో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. స్థానిక వ్యక్తి పదిహేనేళ్ల క్రితం కుషీ నగర్‌కు చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు నలుగురు సంతానం. బాధిత భర్త పని నిమిత్తం కొన్నాళ్లు వేరే రాష్ట్రానికి వెళ్లాడు.

    READ ALSO  Rahul Gandhi | రాహుల్‌గాంధీ కీల‌క నిర్ణయం.. 22 మంది చిన్నారుల ద‌త్త‌త‌

    అతడి భార్య తన పిల్లలతో కలిసి గ్రామంలోనే ఉండిపోయింది. ఆ టైంలో సమీప గ్రామంలోని ఓ యువకుడితో రెండేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య ఏర్పడిన ఆకర్షణ వివాహేతర సంబంధానికి దారి తీసింది.

    Uttar Pradesh : భర్తకు తెలియడంతో..

    విషయం తెలిసిన భర్త.. ఆమెను మందలించాడు. కానీ, ఆమె వెనక్కి తగ్గలేదు. ప్రియుడితో మరింత ఎంజాయ్​ చేయడం మొదలు పెట్టింది. ఒకరోజు పిల్లలను ఇంట్లోనే వదిలేసి, ప్రియుడితో లేచిపోయింది. దీంతో బాధిత భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

    Uttar Pradesh : స్ట్రాంగ్​ వార్నింగ్​..

    దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సదరు లస్ట్ జంటను వెనక్కి పిలిపించారు. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది. బాధిత భర్తకు అతడి భార్య స్ట్రాంగ్​ వార్నింగ్​ ఇచ్చింది. తనకు భర్త అంటే ఇష్టం లేదని స్పష్టం చేసింది. ఒక వేళ బలవంతంగా ఇంటికి తీసుకెళ్తే.. తన భర్తను చంపేసి, మృతదేహాన్ని డ్రమ్​లో వేసి సిమెంట్​తో నింపేస్తానని బెదిరించింది. ఆ తర్వాత మళ్లీ తన ప్రియుడితో పారిపోతానని చెప్పింది.

    READ ALSO  Nimisha Priya | ఆ వార్తలు అవాస్తవం.. నిమిష ప్రియ మరణశిక్ష రద్దు కాలేదు.. కేంద్ర ప్రభుత్వ వర్గాల క్లారిటీ

    Uttar Pradesh : వణికిపోయిన భర్త..

    భార్య ఇచ్చిన స్ట్రాంగ్​ వార్నింగ్​కు భర్త షాక్​ అయిపోయాడు. నిలువెళ్లా వణికిపోయి, ఓ నిర్ణయానికి వచ్చాడు. తన భార్యకు ఓ ఆలయంలో ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించి, ఇద్దరిని పంపించాడు. వారి బాగోతం తెలిసినప్పటి నుంచి తనను ఆమె చంపేస్తానని బెదిరిస్తూ వచ్చిందని బాధితుడు వాపోతూ చెప్పుకొచ్చాడు.

    Latest articles

    Rural MLA Bhupathi Reddy | కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక ఎంతో ప్రగతి సాధించాం..

    అక్షరటుడే, ఆర్మూర్: Rural MLA Bhupathi Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎంతో ప్రగతి...

    Minister Seethakka | కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం..

    అక్షరటుడే, బాన్సువాడ: Minister Seethakka | కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్​ఛార్జి...

    Chevella | బర్త్​ డే పార్టీలో డ్రగ్స్​.. ఆరుగురు ఐటీ ఉద్యోగుల అరెస్ట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chevella | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో డ్రగ్స్​ వినియోగం పెరిగిపోతోంది. పార్టీలు, పబ్​లు అంటూ...

    GP Secretaries | 15 మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్‌.. 47 మంది ఎంపీవోలకు నోటీసులు.. ఎందుకో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GP Secretaries | ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 15 మంది పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్​ చేసింది....

    More like this