ePaper
More
    HomeతెలంగాణSports Policy | యువత డ్రగ్స్​కు బానిస కావడం ఆందోళనకరం : సీఎం రేవంత్​రెడ్డి

    Sports Policy | యువత డ్రగ్స్​కు బానిస కావడం ఆందోళనకరం : సీఎం రేవంత్​రెడ్డి

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sports Policy | రాష్ట్రంలో యువత ముఖ్యంగా విద్యార్థులు గంజాయి, డ్రగ్స్​ వంటి మాదకద్రవ్యాలకు అలవాటు పడుతున్నారని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ (Hyderabad)లోని హెచ్‌ఐసీసీ వేదికగా శనివారం నిర్వహించిన తెలంగాణ క్రీడా సదస్సులో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాటం చేసిన యువత ప్రస్తుతం దశ, దిశ లేకుండా వ్యసనాలకు బానిస అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాల నుంచి యువతకు కాపాడుకోవాలని సూచించారు. స్పోర్ట్స్​ పాలసీతోనే ఇది సాధ్యమన్నారు.

    Sports Policy | ఆట స్థలాలు అవసరం

    యువతకు ఆట స్థలాలు అవసరం, మాదకద్రవ్యాలు కాదని సీఎం రేవంత్​రెడ్డి అన్నారు. తెలంగాణ క్రీడా విధానాన్ని (Sports Policy) ఆయన ఆవిష్కరించారు. క్రీడా సంస్కృతి లేకపోవడంతోనే యువత వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారని పేర్కొన్నారు. విద్యారంగంలోనే కాకుండా మైదానంలో కూడా ప్రతిభను పెంపొందించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న క్రీడాకారులకు ఆర్థిక సాయం చేస్తామన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించకపోవడం దేశానికి, రాష్ట్రానికి చాలా ప్రమాదమని సీఎం పేర్కొన్నారు. క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

    READ ALSO  Operation Muskan | ఆపరేషన్​ ముస్కాన్​లో 7,678 మంది చిన్నారులను రక్షించిన పోలీసులు

    Sports Policy | ఒలింపిక్స్​ నిర్వహణకు సిద్ధం

    క్రీడలకు తెలంగాణను వేదిక చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని సీఎం పేర్కొన్నారు. విజన్ డాక్యుమెంట్ 2047లో స్పోర్ట్స్ పాలసీకి ఒక ఛాప్టర్ కేటాయించామన్నారు. నేషనల్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, వరల్డ్ మిలటరీ గేమ్స్ నిర్వహించిన చరిత్ర హైదరాబాద్​కు ఉందన్నారు. 2026లో ఖేల్ ఇండియా (Khel India) పోటీల నిర్వహణకు తెలంగాణకు అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరామన్నారు. ఒలింపిక్స్ (Olympics) ​లో సైతం రెండు విభాగాల నిర్వహణకు సిద్ధమని చెప్పామన్నారు. ఇటీవల జరిగిన ఒలింపిక్స్​లో భారత్​ ఒక్క బంగారు పథకం సాధించకపోవడం దేశానికి అవమానమన్నారు. క్రీడాకారుల కోసం రాష్ట్రంలో యంగ్​ ఇండియా స్పోర్ట్స్​ అకాడమీ, యంగ్​ ఇండియా స్పోర్ట్స్​ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు.

    Latest articles

    Railway Passengers | నత్తనడకన మనోహరాబాద్​–కొత్తపల్లి రైల్వేలైన్​ పనులు.. భారీగా పెరిగిన అంచనా వ్యయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Passengers | మనోహరాబాద్​–కొత్తపల్లి రైల్వే లైన్​ (Manoharabad–Kothapalli Railway Line) పనులు నత్తనడకన...

    Superstar Rajinikanth | కూలీ ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌లో ర‌జ‌నీకాంత్ పాదాల‌పై ప‌డ్డ స్టార్ హీరో.. అంతా షాక్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Superstar Rajinikanth | సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఈ వ‌య‌స్సులోనూ ఉత్సాహంగా సినిమాలు చేస్తూ...

    Assembly Speaker | వారి భ‌విత‌వ్య‌మేమిటో?.. ఆందోళ‌న‌లో ఫిరాయింపు ఎమ్మెల్యేలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Assembly Speaker | తెలంగాణ‌లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో ఆందోళ‌న క‌నిపిస్తోంది. ప‌ద‌వులు ఉంటాయో...

    Operation Akhal | జమ్మూ కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ముగ్గురు టెర్రరిస్టుల హతం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Operation Akhal | జమ్మూ కశ్మీర్​ (Jammu and Kashmir)లో భారీ ఎన్​కౌంటర్ (Encounter)​...

    More like this