ePaper
More
    HomeసినిమాCoolie Trailer | సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ట్రైల‌ర్ విడుద‌ల‌.. విల‌న్‌గా మారి అద‌ర‌గొట్టిన కింగ్‌...

    Coolie Trailer | సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ట్రైల‌ర్ విడుద‌ల‌.. విల‌న్‌గా మారి అద‌ర‌గొట్టిన కింగ్‌ నాగార్జున

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Coolie Trailer | సూపర్‌స్టార్ రజినీకాంత్ (Super Star Rajinikanth) సినిమా వస్తోంది అంటే అభిమానుల్లో ఉండే ఉత్సాహం వర్ణించలేనిది. దేశంలోనే కాదు, విదేశాల్లోనూ ఆయనకు అపారమైన అభిమానబలం ఉంది. రజినీ సినిమా అంటే ఫస్ట్ డే మార్నింగ్ షో నుంచే థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు వేసే రేంజ్ ఆయ‌న‌ది. యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రూపొందిన ‘కూలీ’తో రజనీకాంత్​ తెరపై సందడి చేయబోతున్నారు.

    ఈ భారీ చిత్రాన్ని ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్ పిక్చర్స్ సన్నాహాలు చేస్తోంది. అయితే అదే రోజున ఎన్టీఆర్, హృతిక్ రోషన్ (NTR and Hrithik Roshan) కాంబినేషన్‌లో వస్తున్న మల్టీ స్టారర్‌ ‘వార్ 2’ War 2కూడా విడుదలవుతోంది. రెండు భారీ సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతున్న నేపథ్యంలో, బాక్సాఫీస్‌ పోరు ఉత్కంఠగా మారింది. ఈ రెండు సినిమాల్లో ఏది పైచేయి సాధించబోతోందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగుతోంది.

    READ ALSO  Urvashi Rautela | అయ్య‌య్యో.. అలా ఎలా.. ఆ మ్యాచ్‌కి వెళ్లి ఏకంగా రూ.70 ల‌క్ష‌లు పోగొట్టుకున్న హీరోయిన్

    Coolie Trailer | ట్రైల‌ర్ అదిరింది..

    కూలీ చిత్రంపై (Coolie Movie) అంచ‌నాలు పెంచేలా మేక‌ర్స్ తాజాగా ట్రైల‌ర్ విడుద‌ల (trailer release) చేశారు. లోకేష్ త‌న‌దైన శైలిలో కూలీ చిత్రాన్ని ఆవిష్క‌రించారు. ట్రైల‌ర్ ఆస‌క్తిక‌రంగా ఉంది. నాగార్జున విలన్‌గా అద‌ర‌గొట్టాడు. ట్రైల‌ర్ మూవీపై భారీ అంచ‌నాలు పెంచింది అని చెప్పాలి. దర్శకుడు కనగరాజ్ మొదట్లో ట్రైలర్ విడుదల చేయకుండా.. నేరుగా సినిమా రిలీజ్​ చేద్దామని అనుకున్నారు. ఈ విషయమై కొంతమంది ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు. కానీ మేకర్స్ నిర్ణయాన్ని మార్చుకొని శనివారం ట్రైలర్ విడుదల చేశారు. దీంతో రజినీ ఫ్యాన్స్‌ సంతోష పడుతున్నారు.

    కూలీ మూవీ లోకేష్ కనగరాజు సినిమాటిక్ యూనివర్స్ (LCU) లో భాగంగా రూపొందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ‘మోనికా’ సాంగ్‌ సోషల్ మీడియాలో (Social media) హాట్ టాపిక్‌గా మారింది. ఈ పాటలో పూజా హెగ్డే కన్నా మలయాళ నటుడు సాబిన్ షాహిర్ డ్యాన్స్‌తో అదరగొట్టారు. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను రూ.44 కోట్ల భారీ మొత్తానికి దగ్గుబాటి సురేష్‌బాబు, సునీల్ నారంగ్ సంయుక్తంగా సొంతం చేసుకున్నారు. సినిమాలో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), సత్యరాజ్, శ్రుతి హాసన్ కీలక పాత్రల్లో నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ ఒక స్పెషల్ గెస్ట్ రోల్‌లో కనిపించనున్నారు.

    READ ALSO  Maya Sabha Trailer | రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థులుగా మారిన‌ గొప్ప స్నేహితులు.. మయ స‌భ ట్రైల‌ర్ ఏం చెబుతుందంటే..!

    Latest articles

    Railway Passengers | నత్తనడకన మనోహరాబాద్​–కొత్తపల్లి రైల్వేలైన్​ పనులు.. భారీగా పెరిగిన అంచనా వ్యయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Passengers | మనోహరాబాద్​–కొత్తపల్లి రైల్వే లైన్​ (Manoharabad–Kothapalli Railway Line) పనులు నత్తనడకన...

    Superstar Rajinikanth | కూలీ ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌లో ర‌జ‌నీకాంత్ పాదాల‌పై ప‌డ్డ స్టార్ హీరో.. అంతా షాక్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Superstar Rajinikanth | సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఈ వ‌య‌స్సులోను ఉత్సాహంగా సినిమాలు చేస్తూ...

    Assembly Speaker | వారి భ‌విత‌వ్య‌మేమిటో?.. ఆందోళ‌న‌లో ఫిరాయింపు ఎమ్మెల్యేలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Assembly Speaker | తెలంగాణ‌లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో ఆందోళ‌న క‌నిపిస్తోంది. ప‌ద‌వులు ఉంటాయో...

    Operation Akhal | జమ్మూ కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ముగ్గురు టెర్రరిస్టుల హతం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Operation Akhal | జమ్మూ కశ్మీర్​ (Jammu and Kashmir)లో భారీ ఎన్​కౌంటర్ (Encounter)​...

    More like this