ePaper
More
    HomeతెలంగాణHyderabad | ప్రియురాలితో బిజీగా ఉన్న భర్త.. భార్య ఎంట్రీతో షాక్​.. తర్వాత ఏమైందంటే?

    Hyderabad | ప్రియురాలితో బిజీగా ఉన్న భర్త.. భార్య ఎంట్రీతో షాక్​.. తర్వాత ఏమైందంటే?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hyderabad | సమాజంలో వివాహేతర సంబంధాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కట్టుకున్న వారిని కాదని పలువురు మరొకరి పంచన చేరుతున్నారు. అంతేగాకుండా ప్రియుడి మోజులో కొంత మంది మహిళలు కట్టుకున్న వాడిని కడతేరుస్తున్నారు. వివాహేతర సంబంధం కోసం కొంత మంది భార్యలను హత్య చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఇటీవల ఇలాంటి ఘటనలు పెరిగాయి. తాజాగా ఓ వ్యక్తి ప్రియురాలితో బిజీగా ఉండగా.. భార్య రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకుంది.

    పెళ్లయి కుమారుడు ఉన్న వ్యక్తి మరో యువతితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. అంతేకాదు సెపరేట్ రూమ్​ తీసుకొని ఆమెతో గడుపుతున్నాడు. ఈ విషయాన్ని గమనించిన భార్య శనివారం భర్తను రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకుంది. అనంతర ఇద్దరికీ దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని నార్సింగి పోలీస్ స్టేషన్ (Narsingi Police Station) పరిధిలో గల గంధంగూడలో చోటు చేసుకుంది.

    READ ALSO  WhatsApp Grievance | ప్రజలకు గుడ్​న్యూస్​.. ఇక వాట్సాప్​లో ఫిర్యాదు చేయొచ్చు

    Hyderabad | రెండేళ్ల క్రితం నుంచి..

    హైదరాబాద్ (Hyderabad)​ నగరానికి చెందిన వేణు కుమార్, శిరీషలకు 13 ఏళ్ల క్రితం పెళ్లయింది. ఈ దంపతులకు ఏడేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. అయితే వేణు భార్యకు తెలియకుండా మరో యువతితో ప్రేమ (Love) వ్యవహారం నడుపుతున్నాడు. రెండేళ్ల నుంచి ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చినట్లు భార్య చెప్పింది. మరొక యువతితో సంబంధం పెట్టుకున్న ఆయన నిత్యం భార్యతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో శిరీష భర్తపై అనుమానంతో నిఘా పెట్టింది. దీంతో మౌనిక అనే యువతితో తన భర్త సంబంధం పెట్టుకున్నట్లు ఆమె గుర్తించింది. ఒక గది అద్దెకు తీసుకొని ఆమెతో కలిసి ఉంటున్నాడని తెలుసుకొని షాక్​ అయింది. శనివారం తన కుటుంబ సభ్యులతో కలిసి అక్కడికి వెళ్లింది. ఫ్లాట్​కు వెళ్లి చూడగా.. తన భర్త మరో యువతితో ఉన్నాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె ఇద్దరికి దేహశుద్ధి చేసింది. అనంతరం పోలీసులకు అప్పగించింది.

    READ ALSO  Weather Updates | నేడు రాష్ట్రానికి వర్ష సూచన

    Latest articles

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    Meenakshi natarajan | బీసీల తలరాత మార్చనున్న 42 శాతం రిజర్వేషన్లు : మీనాక్షి నటరాజన్

    అక్షరటుడే, ఆర్మూర్: బీసీల తలరాతను 42 శాతం రిజర్వేషన్లు మార్చనున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్...

    More like this