ePaper
More
    Homeక్రీడలుENGvIND | ఇంగ్లండ్ బౌల‌ర్ల స‌హ‌నాన్ని ప‌రీక్షించిన జైస్వాల్, ఆకాశ్.. భార‌త్ ఆధిక్యం ఎంతంటే!

    ENGvIND | ఇంగ్లండ్ బౌల‌ర్ల స‌హ‌నాన్ని ప‌రీక్షించిన జైస్వాల్, ఆకాశ్.. భార‌త్ ఆధిక్యం ఎంతంటే!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ENGvIND | ఇంగ్లండ్‌తో జరుగుతున్న అండర్సన్–టెండూల్కర్ ట్రోఫీ (Anderson-Tendulkar Trophy) చివరి టెస్టు (ఓవల్ టెస్ట్)లో టీమిండియా బ్యాటర్లు అదరగొడుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) (108 నాటౌట్) ఈసారి అద్భుతంగా రాణిస్తూ జట్టుకు త‌న వంతు స‌పోర్ట్ అందిస్తున్నాడు. నైట్‌వాచ్‌మన్‌గా వచ్చిన ఆకాశ్ దీప్ (66) అనుభవం ఉన్న ప్లేయర్‌లా ఆడి, యశస్వీకి అండగా నిలిచాడు. ఈ క్ర‌మంలోనే కెరీర్‌లో తొలిసారి అర్ధ సెంచ‌రీ న‌మోదు చేశాడు ఆకాశ్. ఓవర్‌నైట్ స్కోర్ 75/2తో మూడో రోజు ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్, మ్యాచ్‌ను తమ వైపునకు తిప్పుకునే దిశగా దూసుకెళ్తోంది.

    ENGvIND | ఆకాశ్ అద‌ర‌హో..

    రెండో రోజు అర్ధశతకం బాదిన యశస్వీ మూడో రోజూ అదే జోరును కొనసాగించాడు. ఇంగ్లండ్ పేసర్లను ధైర్యంగా ఎదుర్కొంటూ, స్పెషల్ షాట్లతో బంతిని స్టాండ్స్‌కి పంపిస్తున్నాడు. స్లిప్ ఏరియాలో వచ్చిన బంతిని బౌండరీలుగా మలుస్తూ ఫీల్డర్లను తలపట్టుకునేలా చేస్తున్నాడు. జేమీ ఓవర్టన్, జోష్ టంగ్ బౌన్సర్లతో అటాక్​ చేసినా.. ఆకాశ్ దీప్ (Akash Deep) ఓపికతో ఆడి పరుగులు చేశాడు. యశస్వీకి మంచి భాగస్వామిగా నిలిచిన ఆకాశ్, ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు సెంచరీకు పైగా పరుగులు జోడించారు. అనంతరం 66 పరుగుల వద్ద ఆకాశ్​ ఔట్​ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్​కు వచ్చిన కెప్టెన్​ గిల్​(11) ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. కరుణ నాయర్​ (17) పరుగులు చేసి వెనుదిరిగాడు. ప్రస్తుతం భారత్ 199/5 పరుగులు చేసింది. జైస్వాల్ తో పాటు రవీంద్ర జడేజా​ (2) క్రీజులో ఉన్నాడు. ఇండియా 212 పరుగుల ఆధిక్యంలో ఉంది.

    READ ALSO  IND PAK Semi Finals | ఒకే ఒక్క మ్యాచ్ గెలిచి సెమీస్‌కి వెళ్లిన భార‌త్.. రేపు పాక్‌తో మ్యాచ్ ఆడుతుందా?

    అయితే ఈ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో భార‌త ఓపెన‌ర్ యశస్వి జైస్వాల్ రెండు సార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుని హాఫ్ సెంచ‌రీ సాధించాడు. 40 పరుగుల వద్ద ఉన్నప్పుడు జోష్ టంగ్ (Tung) వేసిన 14వ ఓవర్లో ఒక షార్ట్ బంతిని ఫుల్ షాట్ ఆడటానికి ప్రయత్నించగా.. బంతి సరిగ్గా లాంగ్ లెగ్ దిశలో ఉన్న లియామ్ డాసన్ చేతుల్లోకి వెళ్లింది. ఇది సుల‌భ‌మైన క్యాచ్ అయిన‌ప్ప‌టికీ డాస‌న్ దానిని మిస్ చేశాడు. అంత‌క‌ముందు 20 పరుగుల వద్ద ఉన్నప్పుడు గస్ అట్కిన్సన్ బౌలింగ్‌లో జైస్వాల్‌ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో ఉన్న హ్యారీ బ్రూక్ వదిలేశాడు. దీంతో జైస్వాల్‌కి రెండు అవ‌కాశాలు వ‌చ్చిన‌ట్టైంది. అయితే ఈ రెండు అవ‌కాశాల త‌ర్వాత దూకుడును కొనసాగించిన జైస్వాల్‌ కేవలం 44 బంతుల్లోనే అర్ధ శతకాన్ని పూర్తి చేసుకున్నాడు.

    READ ALSO  World Champions of Legends | సెమీ ఫైనల్​ మ్యాచ్​ను బాయ్​కాట్​ చేసిన భారత్​.. ఫైనల్​కు వెళ్లనున్న పాక్​

    Latest articles

    Kaleshwaram Commission | రేపు కేబినెట్ ముందుకు కాళేశ్వరం నివేదిక.. ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో?

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Kaleshwaram Commission | కాళేశ్వరం కమిషన్ నివేదిక సోమవారం మంత్రిమండలికి చేరనుంది. ఈ మేరకు...

    Viral video | వైర‌ల్ వీడియో.. ఎలుగుబంటితో మందుబాబు కుస్తీ.. చివ‌రికి ఏమైందంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Viral video | సోష‌ల్ మీడియాలో కొన్నివీడియోలు ఒళ్లు గ‌గుర్పొడిచేలా చేస్తాయి. ఒక్కోసారి ఆ వీడియోలు...

    Railway Passengers | నత్తనడకన మనోహరాబాద్​–కొత్తపల్లి రైల్వేలైన్​ పనులు.. భారీగా పెరిగిన అంచనా వ్యయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Passengers | మనోహరాబాద్​–కొత్తపల్లి రైల్వే లైన్​ (Manoharabad–Kothapalli Railway Line) పనులు నత్తనడకన...

    Superstar Rajinikanth | కూలీ ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌లో ర‌జ‌నీకాంత్ పాదాల‌పై ప‌డ్డ స్టార్ హీరో.. అంతా షాక్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Superstar Rajinikanth | సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఈ వ‌య‌స్సులోనూ ఉత్సాహంగా సినిమాలు చేస్తూ...

    More like this