ePaper
More
    Homeజిల్లాలుహైదరాబాద్Hydraa | వాళ్లే హైడ్రాపై దుష్ప్రచారం చేస్తున్నారు.. కమిషనర్​ రంగనాథ్​ కీలక వ్యాఖ్యలు

    Hydraa | వాళ్లే హైడ్రాపై దుష్ప్రచారం చేస్తున్నారు.. కమిషనర్​ రంగనాథ్​ కీలక వ్యాఖ్యలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో అక్రమ నిర్మాణాలు కూల‌గొట్టడం మాత్రమే కాదని, ప‌ర్యావ‌ర‌ణ హిత‌ న‌గ‌ర నిర్మాణ‌మే హైడ్రా ల‌క్ష్య‌మ‌ని క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ (Ranganath) అన్నారు. హైడ్రా అంటే భ‌యం కాద‌ని.. న‌గ‌ర ప్ర‌జ‌లంద‌రికీ అభ‌యం అని పేర్కొన్నారు.

    చెరువులు, నాలాలు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ను క‌బ్జా చేసిన వారు చేస్తున్న దుష్ప్ర‌చారాన్ని తిప్పి కొట్టాల‌ని ఆయన కోరారు. ఐదు ఎక‌రాల భూమిని క‌బ్జా చేసి అందులో ప‌ని వాళ్ల‌కోసం ఒక షెడ్డు వేస్తున్నారని కమిషనర్​ పేర్కొన్నారు. దానిని తొల‌గించిన‌ప్పుడు వారిని ముందుంచి గేమ్ ఆడి ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారన్నారు. హైడ్రా బ‌స్తీతో దోస్తీ కార్య‌క్ర‌మంలో భాగంగా శ‌నివారం టోలీచౌక్ (Tolichowki) ప్రాంతంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

    READ ALSO  Weather Updates | నేడు వర్ష సూచన

    Hydraa | ఎప్పుడూ పేదల పక్షమే..

    హైడ్రా ఎప్పుడూ పేద‌లు, సామాన్యుల ప‌క్ష‌మే అని కమిషనర్​ పేర్కొన్నారు. హైడ్రాను బూచిగా చూపించి క‌బ్జాల‌ను, ఆక్ర‌మ‌ణ‌లను కాపాడుకోడానికి బ‌డాబాబులు దుష్ప్ర‌చారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఆ ప్రచారాన్ని తిప్పి కొట్టాల‌ని కోరారు. పేద‌లు ఎక్క‌డైనా ఇల్లు నిర్మించుకుని ఉంటే వాటిని తొల‌గించ‌బోమని స్పష్టం చేశారు. ఒక వేళ తప్పనిసరిగా ఆ నిర్మాణాన్ని తొలగించాల్సి వస్తే.. వారికి ప్ర‌త్యామ్నాయంగా ఎక్క‌డైనా నివాసాన్ని చూపించిన తర్వాతే హైడ్రా ముందుకు వెళ్తుందన్నారు.

    Hydraa | మూసీ నదిని ఆక్రమించి నెలకు రూ.కోటి ఆదాయం

    మూసీ న‌ది (Musi River) సుంద‌రీక‌ర‌ణ‌తో హైడ్రాకు సంబంధం లేదని కమిషనర్​ స్పష్టం చేశారు. అయితే ఇటీవల మూసీ నదిని ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను తొలగించామన్నారు. కొందరు వ్యక్తులు 10 ఎక‌రాల మేర నదిని క‌బ్జా చేసి నెల‌కు రూ. కోటి ఆదాయం పొందుతున్నారని చెప్పారు. వారి షెడ్లను కూల్చి వేశామని ఆయన తెలిపారు.

    READ ALSO  Weather Updates | నేడు రాష్ట్రానికి వర్ష సూచన

    Hydraa | చెరువుల ప‌రిర‌క్ష‌ణ అంద‌రి బాధ్య‌త‌

    నాలాల‌ను, చెరువుల‌ను పరిరక్షించడం అందరి బాధ్యత అని హైడ్రా కమిషనర్​ తెలిపారు. షేక్‌పేట‌, టోలీచౌక్​లోని నాలాల్లో ప‌రుపులు, దిండులు, ప్లాస్టిక్ వ్య‌ర్థాలు పేరుకుపోవ‌డంతో గ‌తంలో వ‌ర‌ద ముంచెత్తిందన్నారు. అయితే ప‌ది రోజులుగా నాలాల పూడిక‌ను తొల‌గించ‌డంతో ఇప్పుడు వ‌ర‌ద సాఫీగా సాగుతోంద‌న్నారు. నాలాలో చెత్త వేయకుండా స్థానికులు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

    Latest articles

    Assembly Speaker | వారి భ‌విత‌వ్య‌మేమిటో?.. ఆందోళ‌న‌లో ఫిరాయింపు ఎమ్మెల్యేలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Assembly Speaker | తెలంగాణ‌లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో ఆందోళ‌న క‌నిపిస్తోంది. ప‌ద‌వులు ఉంటాయో...

    Operation Akhal | జమ్మూ కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ముగ్గురు టెర్రరిస్టుల హతం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Operation Akhal | జమ్మూ కశ్మీర్​ (Jammu and Kashmir)లో భారీ ఎన్​కౌంటర్ (Encounter)​...

    South Africa | డివిలియ‌ర్స్ విధ్వంస‌క‌ర సెంచ‌రీ.. పాక్‌ని చిత్తుగా ఓడించి టైటిల్ ఎగ‌రేసుకుపోయిన సౌతాఫ్రికా

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: South Africa : గ‌త కొద్ది రోజులుగా WCL 2025 (వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్)...

    Weather Updates | నేడు తేలికపాటి వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Weather Updates | రాష్ట్రంలో వారం రోజులుగా వరుణుడు ముఖం చాటేశాడు. ఎండలు దంచి...

    More like this