అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Collector | దోమకొండ గడికోట ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందజేయడం అభినందనీయమని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ (Collector Ashish Sangwan) అన్నారు.
కలెక్టర్ కార్యాలయంలో గడికోట ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను (oxygen concentrators) దేవునిపల్లి, బీబీపేట, భిక్కనూరు, లింగంపేట, రామరెడ్డి, నాగిరెడ్డిపేట నస్రుల్లాబాద్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఆస్పత్రిలో చాలా ఉపయోగకరంగా ఉంటాయన్నారు. కరోనా సమయంలో అనేకమంది రోగులకు ప్రాణాలను రక్షించడంలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు చాలా ఉపయోగపడ్డాయని వివరించారు.
ఒక ఆక్సిజన్ కాన్సంట్రేటర్ విలువ రూ.66వేలకు పైగా ఉంటుందని, వీటిని జిల్లాలోని ఏడు పీహెచ్సీలకు ఉచితంగా అందించినందుకు దోమకొండ కోట ట్రస్ట్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే చలికాలాన్ని దృష్టిలో ఉంచుకొని వైద్యాధికారులు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఉపయోగించుకొని ప్రజలకు సేవలందించాలని సూచించారు. అలాగే రామారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిని (District Medical and Health Department Officer) ఆదేశించారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో చంద్రశేఖర్, డిప్యూటీ డీఎంహెచ్వో ప్రభుకిరణ్, ఆయా పీహెచ్సీల వైద్యాధికారులు, గడికోట ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.