Midday Meal
Midday Meal | మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

అక్షరటుడే, ఇందూరు: Midday Meal | మధ్యాహ్న భోజన కార్మికులకు రావాల్సిన రూ.3.50 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ (AITUC) జిల్లా కార్యదర్శి ఓమయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు కార్మికులతో కలిసి శనివారం జిల్లా కలెక్టరేట్​ను (Collectorate) ముట్టడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా రూ.10వేల వేతనం చెల్లించాలని డిమాండ్​ చేశారు. ఇన్సూరెన్స్, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలన్నారు. సమస్యలను పరిష్కరించకుంటే ఆగస్టు రెండోవారం నుంచి పోరాటాన్నీ ఉధృతం చేస్తామన్నారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ (DEO Ashok) అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షురాలు స్రవంతి, గౌరవాధ్యక్షురాలు సాయమ్మ, కార్యదర్శి చక్రపాణి, హనుమాన్లు, గంగామణి, విజయలక్ష్మి, లావణ్య తదితరులు పాల్గొన్నారు.