అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bhopal | గ్యాంగ్‌రేప్‌కు పాల్పడుతున్న ఓ ముఠాను మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. భోపాల్‌లో కొందరు వ్యక్తులు కాలేజీ విద్యార్థులకు మత్తు మందు ఇచ్చి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఫర్హాన్, సాహిల్ అనే వ్యక్తులు మొదట యువతులతో పరిచయం పెంచుకుంటారు. ఇందులో సాహిల్ ఫ్రీ బైక్ రైడ్లను ఆఫర్ చేస్తూ యువతులను తన గ్యాంగ్‌కు పరిచయం చేస్తాడు. అనంతరం ఫర్హాన్ అనే నిందితుడు పార్టీల పేరుతో వారికి వల వేస్తాడు. పార్టీకి వచ్చిన యువతులకు మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేస్తారు. ఆ దృశ్యాలను వీడియో తీసి అనంతరం బెదిరింపులకు పాల్పడుతారు. అంతేగాకుండా మతం మారాలని బాధితులపై ఒత్తిడి చేస్తారు. ఇలా చాలా మంది నిందితులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇద్దరు యువతులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను అరెస్ట్ చేశారు.
Bhopal | గ్యాంగ్‌రేప్ ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు.. సంచలన విషయాలు వెలుగులోకి..
Published on
