అక్షరటుడే, ఇందూరు: Health Camp | నగరంలోని శివాజీనగర్ మున్నూరుకాపు సంఘంలో (Munnurukapu Sangham) మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు రామర్తి గోపి (Ramarthi Gopi) తెలిపారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు. శివాజీనగర్ (Shivaji nagar) మున్నూరుకాపు సంఘంలో ఆదివారం ఉదయం 8 గంటలకు వైద్యశిబిరం ప్రారంభమవుతుందన్నారు.
ఇందులో భాగంగా ఉచితంగా రక్తపరీక్షలు (Blood test), ఈసీజీ (ECG), డాక్టర్ కన్సల్టేషన్, షుగర్ పరీక్షలు చేస్తారని వివరించారు. అవసరమైన వారికి మందులు సైతం ఉచితంగా అందజేస్తామని ఆయన పేర్కొన్నారు.
జనరల్ ఫిజీషియన్ విశ్వతేజ, గుండె వైద్య నిపుణులు రవికిరణ్, ఆర్థోపెడిక్ సర్జన్ హర్షవర్ధన్ గౌడ్, సర్టికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ రాహుల్ సామల, ప్రసూతి వైద్య నిపుణులు శైలజ, పిల్లల వైద్యుడు అశ్విన్, దంతవైద్యురాలు శిరీష శిబిరంలో రోగులకు పరీక్షలు నిర్వహిస్తారని ఆయన వివరించారు. వైద్యశిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.