ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Tiger | మహంతం శివారులో చిరుత కలకలం.. దూడపై దాడి..

    Tiger | మహంతం శివారులో చిరుత కలకలం.. దూడపై దాడి..

    Published on

    అక్షరటుడే, బోధన్: Tiger | నవీపేట(Navipet) మండలంలో చిరుత కలకలం సృష్టించింది. మహంతం(mahantham) శివారులో ఓ దూడపై దాడి చేసి హతమార్చింది.

    స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహంతం శివారులో ఓ పొలంలోని షెడ్​లో రైతు దూడను కట్టేయగా శుక్రవారం అర్ధరాత్రి వేళ చిరుత దాడి చేసింది. సమాచారం అందుకున్న అటవీశాఖాధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిరుతదాడి ఆనవాళ్లను పరిశీలించారు.

    Tiger | స్థానికుల భయాందోళన

    మహంతంలో చిరుత ఆనవాళ్లు కనిపించడంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. పొలాలకు వెళ్లేందుకు భయపడే పరిస్థితి వచ్చిందని వారు వాపోతున్నారు. శుక్రవారం రాత్రి దూడపై దాడి చేసిన ఘటన కారణంగా పొలల్లో పనులకు వెళ్లడం లేదని వారు పేర్కొన్నారు.

    Tiger | 15 రోజుల వ్యవధిలో రెండోదాడి..

    పదిహేను రోజుల వ్యవధిలోనే చిరుత రెండు వేర్వేరు ప్రాంతాల్లో పశువులపై దాడి చేసిందని గ్రామస్థులు తెలిపారు. ఎడపల్లి (Yedapally) మండలం జానకంపేట్ (janakampet) శివారులో మేకలపై చిరుత దాడి చేసిన ఘటన ప్రజలు మరిచిపోకముందే శుక్రవారం రాత్రి తాజాగా దూడపై చేసింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

    READ ALSO  Education Department | విద్యాశాఖలో ముదిరిన వివాదం.. రెండు రోజులుగా హాజరు సంతకాలు పెట్టని ఉద్యోగులు!

    Tiger | అటవీశాఖాధికారులపై ఆగ్రహం..

    రోజుల వ్యవధిలోనే చిరుత రెండుసార్లు దాడులు చేయడంతో సర్వత్రా భయాందోళన నెలకొంది. ఈ ఘటనలపై అటవీశాఖ చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తుండడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఘటనలు జరిగినప్పుడు వచ్చి వివరాలు సేకరించడం తప్ప ఎలాంటి చర్యలు ఉండడం లేదని వారు వాపోతున్నారు. చిరుతను పట్టుకునేందుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.

    Latest articles

    Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    తేదీ(DATE) – 3 ఆగస్టు​ 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం(Sri Vishwavasu Nama Sasra) విక్రమ సంవత్సరం(Vikrama Sasra) – 2081 పింగళ...

    PCC Chief | కేసీఆర్ పాలనలో చేసిన అప్పులు రూ. 8 లక్షలు.. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు.. సోషల్​ మీడియాలో ట్రోల్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: PCC Chief : తెలంగాణ ప్రదేశ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు మహేష్ కుమార్​ గౌడ్​ షాకింగ్​ గణాంకాలు...

    Uttar Pradesh | చంపి డ్రమ్​లో పాతిపెడతానన్న భార్య.. జడుసుకున్న భర్త..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ కేసు వెలుగు చూసింది. గోరఖ్‌పూర్ జిల్లా(Gorakhpur district)లో ఒక...

    Pavan Kalyan | కూటమి ఐక్యత దెబ్బతీసే ప్రయత్నాలు.. డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pavan Kalyan | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)​ డిప్యూటీ సీఎం పవన్​ కల్యాణ్​ (Pavan...

    More like this