BRS Nizamabad
BRS Nizamabad | బీఆర్ఎస్​ నాయకుల ముందస్తు అరెస్ట్​లు

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: BRS Nizamabad | జిల్లాలో పలువురు బీఆర్​ఎస్​ నాయకులను ముందస్తుగా అరెస్ట్​ చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు (Telangana Jagruthi), ఎమ్మెల్సీ కవిత (Mlc Kavitha) హైదరాబాద్​లోని ఇందిరాపార్క్​ వద్ద చేపట్టనున్న నిరాహార దీక్షకు వెళ్లకుండా పోలీసులు పలువురు బీఆర్​ఎస్​ నాయకులను అడ్డుకుని ఆయా పోలీస్​స్టేషన్లకు (Police station) తరలించారు.

నగరంలో బీఆర్ఎస్ (BRS) నాయకులు సత్యప్రకాశ్, సుజిత్ సింగ్ ఠాకూర్​లను నాలుగో టౌన్​ పోలీస్​స్టేషన్​కు తరలించారు. నుడా మాజీ ఛైర్మన్​ ప్రభాకర్​ రెడ్డిని గృహనిర్బంధం చేశారు. బీఆర్​ఎస్​ సీనియర్​ నాయకులు సిర్పరాజు, అగ్గు సంతోష్​, చింతకాయల రాజు, సదానంద్​లను రెండో టౌన్​ పోలీస్​స్టేషన్​కు తరలించారు.

ఈ సందర్భంగా బీఆర్​ఎస్​ లీగల్​సెల్​ కన్వీనర్​ మధుసూదన్ రావు, కో-కన్వీనర్ పులి జైపాల్ మాట్లాడుతూ.. ప్రజాపాలన అంటూ రాష్ట్రంలో పోలీసు పాలన సాగిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్​కు త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారని వారు పేర్కొన్నారు. అరెస్ట్​ చేసిన వారిని భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్​ చేశారు.