GG College
Giriraj College | అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి కృషి

అక్షరటుడే, ఇందూరు: Giriraj College | అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలంగాణ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ బ్రిజేష్ (Dr. Brijesh) తెలిపారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో (Giriraj College) శనివారం సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే బదిలీలు, కెరీర్ అడ్వాన్స్ స్కీం (Career Advancement Scheme) తదితర సమస్యలను పరిష్కరించామని వివరించారు. అనంతరం ఆయనను అధ్యాపకులు సన్మానించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, అధ్యాపకులు దండు స్వామి, రంగరత్నం, భరత్​రాజ్, ముత్తెన్న, రాజేష్, చంద్రశేఖర్, ఎన్​సీసీ అధికారి లెఫ్టినెంట్ రామస్వామి తదితరులు పాల్గొన్నారు.